Prabhas : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరడుగుల కట్ అవుట్ తో వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి ముందు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఆ తర్వాత చేస్తున్న సినిమాలు మరో లెక్క.. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభిమానులు కాదు విదేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈనెల 28న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.. మరి ఆ సినిమాలేంటో ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ రాబోతున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే కాదు ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే సర్ప్రైజ్ కూడా ఉంది. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలలో కొన్ని సినిమాలు బర్త్ డే సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ సినిమాల గురించి ఒకసారి చూసేద్దాం..
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి పౌర్ణమి.. అయితే ఈ మూవీ థియేటర్లలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ టీవీలలోకి వచ్చి మంచి వ్యూస్ ని రాబట్టడంతో హిట్ అయింది. ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో విడుదలైన నృత్య ప్రధానమైన సినిమా. ఇందులో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్య పాత్రల్లో సింధు తులాని, రాహుల్ దేవ్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఈ ఫిల్మ్ అక్టోబర్ 23న మళ్లీ రిలీజ్ కాబోతుంది.
జూలై 10వ తేదీన విడుదలయింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు.. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
Also Read: శ్రీవల్లికి షాక్.. ప్రేమ రహస్యం బయటపెట్టిన నర్మద.. రామరాజు దెబ్బకు భాగ్యంకు షాక్..
ఈ సినిమాలతో పాటుగా గతంలో నటించిన సలార్ చిత్రం కూడా మళ్లీ ప్రేక్షకుల కోరిక మేరకు రిలీజ్ కాబోతుందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజి సినిమా చేస్తున్నారు. అలాగే యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.. వచ్చే ఏడాది ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.