BigTV English

PhonePe: RBI ని ఏమార్చిన ఫోన్ పే.. రూ.21 లక్షల జరిమానా

PhonePe: RBI ని ఏమార్చిన ఫోన్ పే.. రూ.21 లక్షల జరిమానా

ఆన్ లైన్ లో నగదు లావాదేవీలకు ఫోన్ పే చాలా సురక్షితమైనదని మనం భావిస్తాం. పేమెంట్ల విషయంలో మనుషుల్ని కూడా నమ్మని చాలామంది ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ మాత్రం కచ్చితంగా నమ్ముతారు. అలాంటి ఫోన్ పే కూడా నిబంధనలు ఉల్లంఘించిందంటే నమ్మగలమా? అవును ఇది నిజం. నిబంధనలు ఉల్లంఘించిన ఫోన్ పే సంస్థపై ఆర్బీఐ జరిమానా కూడా విధించింది. రూ.21 లక్షల ఫైన్ చెల్లించాలని ఆదేశించింది.


ఏం జరిగింది?
‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన నిబంధనల విషయంలో ఫోన్ పే కొంత నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. ఈ నిబంధనలు పాటిచకపోవడంతో ఫోన్ పే సంస్థపై జరిమానా పడింది. 2023-అక్టోబర్ నుండి 2024-సెంబర్ వరకు ఫోన్ పే సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఆర్బీఐ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్ లో నిబంధనలు ఉల్లంఘించినట్టు బయటపడింది. తమ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ నోటీసు ఇచ్చింది. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని పేర్కొంది. ఈ నోటీసులకు ఫోన్ పే ఇచ్చిన సమాధానం సరిగా లేదని ఆర్బీఐ నిర్థారించింది. అదనంగా సమర్పించిన రుజువులను కూడా పరిశీలించింది. చివరకు ఆర్బీఐ రూ.21 లక్షలు జరిమానా విధించింది.

ఎస్క్రో ఖాతా బ్యాలెన్స్ లో లోపాలు..
PPIల విషయంలో కంపెనీ ఎస్క్రో ఖాతాలో రోజు చివరిలో ఉన్న బ్యాలెన్స్, వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయిలు సరిపోవాల్సి ఉంటుంది. కానీ ఫోన్ పై విషయంలో ఎస్క్రో బ్యాలెన్స్.. కొన్ని రోజుల్లో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయిలు, చెల్లింపుల విలువ కంటే తక్కువగా ఉంది. ఇక్కడ ఫోన్ పే మరో వ్యూహాత్మక తప్పు చేసింది. ఈ విషయాన్ని వెంటనే ఆర్బీఐకి నివేదించలేదు. దీంతో ఆర్బీఐ ఆడిట్ లో ఈ వ్యవహారం బయటపడింది. లోపాలను సహించేది లేదంటూ ఆర్బీఐ రూ.21 లక్షలు జరిమానా విధించింది.


ఫోన్ పే టాప్..
భారత్ లో జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఫోన్ పే టాప్ లో ఉంది. డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఎక్కువమంది భారతీయులు ఫోన్ పే ని విశ్వసిస్తారు. NPCI డేటా 2025-జులై ప్రకారం, ఫోన్ పే యాప్‌ను భారత్‌లో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో గూగుల్ పే ఉంది. దాని తర్వాత పేటీఎం ఉంది. ఆర్బీఐ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే వెంటనే నియంత్రణకు సిద్ధమవుతుంది. తాజాగా ఫోన్ పే విషయంలో నిబంధనల ఉల్లంఘన బయటపడటంతో ఆర్బీఐ జరిమానా విధించింది. డిజిటల్ చెల్లింపుల లావాదేవీల విషయంలో ఫోన్ పే ఎంత జాగ్రత్తగా ఉన్నా చివరకు ఆర్బీఐ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి భారత్ లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. కరోనా తర్వాత ఈ తరహా లావాదేవీలు భారీగా పెరిగాయి. పట్టణాల్లోనే కాదు, పల్లెటూళ్లలో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారానే చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఆర్బీఐ ఈ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టింది. లావేదేవీలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

Related News

EMI Phone: EMI కట్టకపోతే ఫోన్ పనిచేయదు.. ఆర్బీఐ కొత్త రూల్?

Zaveri Bazaar: మనదేశంలో.. 150 ఏళ్ల చరిత్ర గల అతిపెద్ద బంగారం మార్కెట్.. ఆసియాలోనే పెద్దది

Google pay: ఈ ఒక ట్రిక్‌తో మీ గూగుల్ పే హిస్టరీ పూర్తిగా ఖాళీ.. జస్ట్ ఇలా చేయండి

RBI-KYC Rules: సెప్టెంబర్ 30 లోపు కెవైసి పూర్తి చేయకపోతే ఖాతా ఫ్రీజ్.. ఆర్‌బిఐ హెచ్చరిక

Jio Offer: రీ చార్జ్‌తో పాటు బోనస్‌లు.. జియో కొత్త బంపర్ ప్లాన్

Gold Rate Dropped: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Samsung Galaxy: టెక్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న లీక్స్.. ఫీచర్లు షాక్!

Big Stories

×