భారత్ లో ఈ ఏడాది బంగారం ధరలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం వరకు లక్ష దాటని బంగారం ధర ఇప్పుడు ఏకంగా లక్ష దాటేసి పరుగులు తీస్తుంది. గత కొద్ది రోజులుగా 24 క్యారెట్ల బంగారం అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,25,000 పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ ధర రూ. 1.30000 వేలకు చేరుకుంది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అయితే, ప్రపంచంలో తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుంది అంటే.. అందరూ దుబాయ్ అని చెప్తారు. కానీ, దుబాయ్ కంటే తక్కువ ధరలో బంగారు లభించే దేశాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? అక్కడ తులం బంగారం ధర ఎంత ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ దుబాయ్: ఎడారి దేశం దుబాయ్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ. 1,14,740 పలుకుతుంది. తక్కువ పన్ను, తక్కువ దిగుమతి సుంకం కారణంగా, పండుగల సమయంలో భారతీయులు బంగారం కొనుగోలు చేయడానికి దుబాయ్ ని ఎక్కువగా ఎంచుకుంటారు.
⦿ అమెరికా: అమెరికాలో కూడా భారత్ కంటే బంగారం ధర తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,15,360గా ఉంది. బ్యాలెన్స్ డ్ ట్యాక్స్ పాలసీ, హై ట్రేడ్ వ్యాల్యూమ్స్ కారణంగా భారత్ తో పోల్చితే ధరలు తక్కువగా ఉన్నాయి. బలమైన కరెన్సీ, పారదర్శకమైన ధర కూడా బంగారం తక్కువ ధరకు కారణం అవుతుంది.
⦿ సింగపూర్: ఈ దేశంలోనూ బంగారం ధర భారత్ కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,880 పలుకుతుంది. పన్ను మినహాయింపుల కారణంగా ఇక్కడ బంగారం ధరలు నియంత్రణలో ఉన్నాయి.
⦿ హాంకాంగ్: ఈ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,13,140గా ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత చౌకైన ధరలలో ఒకటిగా నిలిచింది. హాంకాంగ్ బహిరంగ మార్కెట్, తక్కువ దిగుమతి పన్నుల కారణంగా బంగారం చౌకకు లభిస్తుంది.
⦿ టర్కీ: ఈ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,13,040గా ఉంది. దేశంలోని తక్కువ పన్ను రేట్లు, దేశీయ బంగారం మార్కెట్ ధరలను పోటీగా ఉంచడంలో సహాయపడతాయి.
⦿ కువైట్: ఎడారి దేశం కువైట్ లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,13,570గా పలుకుతుంది. స్థిరమైన కరెన్సీ మార్పిడి రేటు, తక్కువ పన్ను విధానం ధరలను స్థిరంగా ఉంచుతాయి.
Read Also: అండర్ వేర్ లో కిలో బంగారం.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్కైన కిలేడీ!