Tamilnadu News: సొసైటీలో జరుగుతున్న సంఘటన ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. రాబోయే రోజులను దృష్టి పెట్టుకుని కొందరు దర్శక-నిర్మాతలు కొత్త సినిమాలు తీస్తున్నాయి. ఆ మధ్య తమిళంలో వచ్చిన కళావాణి మూవీ తరహాలో చేశాడు ఓ యువకుడు. నచ్చిన అమ్మాయికి కారులోనే తాళి కట్టాడు. సంచలనం రేపిన ఈ వ్యవహారం తమిళనాడులో వెలుగుచూసింది.
తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశిపురం నగర్‌లోని కోనేరిపట్టికి చెందిన ఆరుముగం కొడుకు అజయ్ ఇంజినీర్. ఇంజనీరింగ్ చదువుతున్న నుంచి దగ్గరి బంధువు నామక్కల్‌లోని ఏఎస్ పేటకు చెందిన నందినితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. ఇద్దరు దగ్గర బంధువులే. కాకపోతే పెళ్లికి మాత్రం అమ్మాయి బంధువులు ససేమిరా అన్నారు.
పెద్దల వ్యవహారశైలి వల్ల తమ ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడలేదు ఆ ప్రేమికులు. చివరకు అజయ్-నందిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. శుక్రవారం తిరుచెంగోడులోని కళాశాలకు వెళ్లిన నందిని బస్సు ఎక్కి నామక్కల్‌లో సాయంత్రం దిగింది. అదే సమయంలో కారులో వచ్చిన అజయ్, అతడి బంధువులు నందినిని కారులో ఎక్కించుకున్నారు.
కాలేజి నుంచి వస్తున్న కూతుర్ని తీసుకెళ్లడానికి బస్టాప్‌కు వచ్చాడు యువతి తండ్రి దండపాణి. కూతుర్ని కారులో తీసుకుపోవడం చూసి కేకలు పెట్టాడు. వెంటనే కారు ఆపిన అజయ్, ఆయన బంధువులు.. దండపాణితో వాగ్వాదానికి దిగారు. ఈలోగా దండపాణి బంధువులు అక్కడకు వచ్చారు. ఇరువర్గాలు మధ్య గొడవ జరుగుతుండగానే కారులోవున్న నందిని మెడలో తాళి కట్టాడు అజయ్.
ALSO READ: మణిపూర్ ప్రజలకు నేనున్నా.. నాదే భరోసా అన్న ప్రధాని మోదీ
ఉంగరాలు సైతం మార్చుకున్నారు. తన కళ్లెదుట కుమార్తె తాళి కట్టించుకోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు దండపాణి. అమ్మాయి బంధువులు అజయ్ కారు అద్దాలు పగులగొట్టారు. ఆపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ పెద్ద రభస జరిగింది. చివరకు అజయ్‌ని చంపేందుకు ప్రయత్నించాడు కాబోయే మామ. చివరకు అజయ్‌కి గాయాలయ్యాయి.
ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో ఈ వ్యవహారం పోలీసుస్టేషన్ కి చేరింది. తన ఇష్టంతో అజయ్ తాళి కట్టాడని పోలీసులకు యువతి చెప్పింది. ఇద్దరు మేజర్లు కావడంతో ఇన్‌స్పెక్టర్ నందిని కుటుంబసభ్యులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
అజయ్ తన భార్యని తీసుకుని కారులో ఇంటికి వెళ్లిపోయాడు. ఇటీవల తమిళంలో ‘కళావాణి’ సినిమా వచ్చింది. అందులో హీరో కూడా కోరుకున్న అమ్మాయిని కారులో తాళికట్టాడు. అజయ్-నందిని వివాహం కూడా అలాగే జరిగిందని అంటున్నారు.