Nindu Noorella Saavasam Serial Today Episode: బ్లడ్ కోసం వెళ్లిన రాథోడ్ ఉత్తి చేతులతో వస్తాడు హాస్పిటల్‌కు సార్ ఎక్కడ అని మిస్సమ్మను అడిగితే పిల్లలు గణపతి నిమజ్జనం దగ్గరకు వెళ్లారు తీసుకురావడానిక ఆయన వెళ్లారు అని మిస్సమ్మ చెప్తూ ఇంతకీ మీరు వెళ్లిన పని ఏమైంది అని అడుగుతుంది. రణవీర్ ది వేరే బ్లడ్ గ్రూప్ మిస్సమ్మ.. రణవీర్ లాయర్‌ను పట్టుకుని రణవీర్ వైఫ్ గురించి ఎంక్వైరీ చేద్దామనుకున్నాం… కానీ ఆయన నోరు విప్పడం లేదు.. ఒక పక్క ఆపరేషన్‌కు టైం అవుతుంది. బ్లడ్ అరెంజ్ కావడం లేదు అంటూ బాధపడుతుంటాడు రాథోడ్. ఇంతలో మనోహరి వచ్చి ఏంటి రాథోడ్ బ్లడ్ ఇంకా దొరకలేదా..? అని అడుగుతుంది.
లేదు మేడం అని రాథోడ్ చెప్పగానే.. దొరికిన బ్లడ్‌ను నేలపాలు చేసేశారు. అంత కేర్‌లెస్ గా ఎలా ఉన్నావు రాథోడ్ అంటూ తిడుతుంది. దీంతో రాథోడ్ కోపంగా ఎవ్వడో కావాలనే నాకు డాష్ ఇచ్చాడు. వాడి వెనకాల ఎవడున్నాడో నాకు తెలియాలి.. మా సార్ దగ్గర ఉన్న గన్ తీసుకుని షూట్ చేసి పారేస్తాను అంటాడు. ఇంతలో నర్స్ వచ్చి మేడం ఇందాక మిమ్మల్ని ఒకరు కలవడానికి వచ్చారు కదా అని చెప్తుంటే.. ఎవరు సరస్వతి వార్డెన్ గారా..? అని మిస్సమ్మ అడగ్గానే ఆవిడే మేడం అంటూ నర్స్ చెప్తుంది. మనోహరి షాక్ అవుతుంది. ఏంటి మిస్సమ్మ సరస్వతి మేడం ఇక్కడకు వచ్చారా..? అని అడుగుతాడు. అవును రాథోడ్ తను నాతో ఏదో చెప్పాలని వచ్చారు. అంతలో బ్లడ్ కింద పడిపోయిందని తెలిసి మేమంతా బయటకు వచ్చాము.. ఆ తర్వాత సరస్వతి గారిని వెతికితే కనిపించలేదు..అని చెప్తుంది. మనోహరి టెన్షన్ పడుతూ.. నేను ఇంత సేపు దాని కోసమే వెతుకుతుంటే.. అది అక్కడ చచ్చిందా..? అని మనసులో అనుకుంటుంది.
ఇంతలో నర్స్ ఆవిడ గురించి చెప్పడానికే వచ్చాను మేడం.. ఆవిడ అక్కడ ఉన్నారు.. అని చెప్తుంది. ఎక్కడున్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. రండి మేడం చూపిస్తాను.. అంటూ నర్స్ చెప్పగానే.. ఒక్క నిమిషం మీరు అంజు దగ్గర ఉండండి నేను వెళ్లి చూసి వస్తాను అంటుంది మనోహరి.. అక్కర్లేదు మేము వస్తాము. నాన్న మీరు అంజలి దగ్గర ఉండండి.. నేను రాథోడ్ వెళ్లి సరస్వతి మేడంను చూసి వస్తాము అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక అంజుకు ఎక్కడా బ్లడ్ దొరక్కపోవడంతో మనోహరిది కూడా సేమ్ గ్రూప్ అని తెలుసుకుని మనోహరిని బ్లడ్ ఇవ్వమంటాడు అమర్. అమర్ అడగడంతో కాదనలేక మనోహరి బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.
మనోహరి బ్లడ్ ఇస్తుందని తెలుసుకున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. గుప్తతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది గుప్తగారు.. మనోహరి అంజుకు బ్లడ్ ఇస్తానంది.. ఇక అంజలి ఎలాగైనా బతుకుతుంది. ఇక సరస్వతి మేడం కళ్లు తెరిస్తే ఇక ఆయనకు భాగీకి నిజం తెలుస్తుంది. ఇక మనోహరిని ఇంటి నుంచి దూరంగా వెళ్లగొడతారు. అప్పుడు నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది చాలు నాకు అందుకే ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. అంటూ ఆరు ఎమోషనల్ అవుతుంది. గుప్త దగ్గరకు వచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా..? బాలిక.. అని అడుగుతాడు. అవును గుప్త గారు.. నాకు చాలా అంటే చాలా తృప్తిగా ఉంది గుప్తగారు అని చెప్తుంది. అయితే ఇక మనం బయలుదేరుదమా..? అని గుప్త అడగ్గానే.. ఎక్కడికి బయలుదేరేది.. అని ఆరు అడుగుతుంది.
దీంతో గుప్త మా లోకం.. యమపురికి వెళ్దామా..? బాలిక.. ఇక నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైంది బాలిక ఇక ఇప్పుడు తప్పకుండా వెళ్లాలి.. అంటూ గుప్త చెప్పగానే.. ఆరు షాక్ అవుతుంది. లేదు గుప్త గారు నాకు నా కుటుంబం కావాలి. నేను నా కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి రాలేను.. రాను.. దయచేసి నన్ను ఇక్కడే వదిలేయండి గుప్తగారు.. నాకు నా కుటుంబం కావాలి గుప్తగారు ఫ్లీజ్ నన్ను వదిలేయండి.. అంటూ ఆరు ప్రాధేయపడుతుంది. దీంతో గుప్త అదే చెప్తున్నాను.. బాలిక నీకు నీ కుటుంబం శాశ్వతంగా కావాలి అంటే ఇప్పుడు నువ్వు నాతో మా లోకానికి రావాలి రావాల్సిన సమయం వచ్చింది బాలిక. నువ్వు మరు జన్మ ఎత్తే సయమం వచ్చింది. నువ్వు మరు జన్మగా నీ సహోదరి భాగమతికి నువ్వు పుత్రికగా జన్మించనున్నావు.. అంటూ గుప్త చెప్పగానే..
ఆరు ఆశ్చర్యంగా ఎమోషనల్ అవుతూ నిజమా గుప్త గారు.. నేను మళ్లీ పుట్టబోతున్నానా..? అది నా చెల్లికి బిడ్డగా రాబోతున్నానా..? నేను మళ్లీ నా వాళ్ల మధ్యకు వెళ్లబోతున్నానా..? అంటూ అడగ్గానే.. నిజమే నేను చెప్పబోతున్నది ముమ్మాటికీ సత్యము బాలిక. నీ మరుజన్మగా నీ పతి దేవునికి నీ సహోదరికి నీవు పుత్రికగా పుట్టబోతున్నావు అంటూ గుప్త కరాకండిగా చెప్పగానే… ఆరు ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.