ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1, 2025 నుంచి కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇకపై ఆధార్ కార్డును ఈజీగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇకపై ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆధార్ అప్ డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ సహా అన్ని వివరాలను ఇప్పుడు ఇంటి దగ్గరి నుంచే ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త ఆధార్ రూల్స్ ఆధార్ సేవలను వేగంగా, సరళంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
⦿ ఆధార్ అప్ డేట్స్: గతంలో ఆధార్ లో మార్పులు చేర్పులు చేయాలంటే కచ్చితంగా ఆధార సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ లో చేయవచ్చు. మీరు సమర్పించే వివరాలు, పేరు, చిరునామా లాంటివి, మీ పాన్ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ తో ఆటోమేటిక్ గా కన్ఫార్మ్ చేయబడుతాయి. ఈ విధానం వల్ల వేగవంతమైన, సురక్షితమైన ఆధార్ అప్ డేట్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి: ప్రతి పాన్ హోల్డర్ డిసెంబర్ 31, 2025 నాటికి తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలి. ఒకవేళ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు పని చేయదు. ఒకవేళ పాన్ కార్డు క్యాన్సిల్ అయితే ఫైనాన్సియల్, ట్యాక్స్ సంబంధించి అంశాలకు వినియోగించే అవకాశం ఉండదు. కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నా ఇకపై ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది.
⦿ ఈజీగా KYC ప్రక్రియ: ఇక బ్యాంకులు, ఆర్థిక సంస్థల కోసం KYC విధానాన్ని సులభతరం చేశారు. మీరు ఇప్పుడు KYCని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ OTP ధృవీకరణ, వీడియో KYC, ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా పేపర్ లెస్ ప్రక్రియగా మారనుంది.
⦿ పేరు, చిరునామా, మొబైల్ నంబర్ అప్ డేట్- రూ. 75
⦿ ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్, ఫోటో అప్ డేట్- రూ. 125
⦿ 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్స్- ఫ్రీ
⦿ జూన్ 14, 2026 వరకు ఉచిత ఆన్ లైన్ డాక్యుమెంట్ అప్ డేట్స్, ఆ తర్వాత నమోదు కేంద్రంలో రూ. 75 ఖర్చవుతుంది.
⦿ ఆధార్ రీ ప్రింట్ అభ్యర్థనకు- రూ. 40
⦿ హోమ్ ఎన్ రోల్ మెంట్ సర్వీస్: మొదటి వ్యక్తికి రూ. 700. అదే చిరునామాలో ప్రతి అదనపు వ్యక్తికి రూ. 350
తాజాగా రూల్స్ ద్వారా ఆధార్ మెయింటెనెన్స్ ను మరింత సులభతరం చేయనున్నాయి. వినియోగదారుల సమయం ఆదా అవుతుంది. ఇంటి నుంచే వివరాలను అప్ డేట్ చేసుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది.
Read Also: ఐఫోన్ లవర్స్ కు అలర్ట్, ఇలా ముంచేస్తారు జాగ్రత్త!