Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు.. అమెరికా కొత్త టారిఫ్స్ రేట్ల భయంతో భారీగా పెరిగాయి. అయితే ట్రంప్ తన కొత్త సుంకాలను ప్రకటించిన మరుసటి రోజునే పసిడి ధరలు ఆకాశం నుంచి కిందకి దిగివచ్చాయి. అసలే పెళ్లిళ్ల సీజన్..ఈ తరుణంలో గోల్డ్ రేట్స్ తగ్గడంతో.. పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. వారాంతంలో షాపింగ్ చేయడానికి వెళ్లే ముందు నేడు గోల్డ్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరకు ఏకంగా రూ.16,000 తగ్గి, రూ.84,000 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.1740 తగ్గి, రూ.91,640 వద్ద కొనసాగుతోంది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న పరస్పర సుంకాలను ప్రకటించారు. “లిబరేషన్ డే” పేరుతో ప్రతీకార సుంకాలను ప్రపంచంపై వదిలారు. చైనా లాంటి ప్రత్యర్థి దేశాలతో పాటు తైవాన్, జపాన్ లాంటి మిత్రదేశాలకు కూడా చెమటలు పట్టించేలా ట్రంప్ టారీఫ్‌లు మోత మోగాయి. దీంతో.. పసిడి ఎగుమతులను నమ్ముకున్న భారత్‌పై కూడా భారీ భారం పడుతుందనే నేపథ్యంలో బంగారం ధరలు తగ్గి సడెన్ షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాల అంశాల ద్వారా బంగారం ధరల్లో మార్పులు సహజమే అయినప్పటికీ.. ఇప్పుడు ట్రంప్ టారీఫ్‌లతో పసిడి ధర తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 ఉంది.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 చేరుకుంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 పలుకుతోంది.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 వద్ద కొనసాగుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,150కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,790 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 కి చేరుకుంది.
కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర నగరాల విషయానికి వస్తే.. ధర రూ.84,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,640 ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,08,000 కి చేరుకుంది.
హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 99,000 కి చేరుకుంది.