E-Paper
Advertisement

MI VS LSG: నేడు ముంబైతో మ్యాచ్.. పంత్ కెప్టెన్సీ పై అందరిలోనూ టెన్షన్ ?

MI VS LSG:  నేడు ముంబైతో మ్యాచ్.. పంత్ కెప్టెన్సీ పై అందరిలోనూ టెన్షన్ ?
Advertisement

MI VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. లక్నోలోని భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నో వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసేసింది ఐపీఎల్ యాజమాన్యం.

మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ జరిగే లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ ఫైట్.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇక లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్…ను జియో హాట్ స్టార్ లో మనం తిలకించవచ్చు. ఉచితంగానే ఈ మ్యాచ్లు అందిస్తోంది రిలయన్స్. అలాగే ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రచారం అవుతున్నాయి.

లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రికార్డులు

Advertisement

లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు జరిగాయి. ఇందులో లక్నో సూపర్ జెంట్స్ పై చేయి సాధించింది. ఆర్ మ్యాచ్ లు జరిగితే ఏకంగా ఐదు మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. అటు ఒకే ఒక్క మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడం జరిగింది. అంటే ముంబై ఇండియన్స్ పైన లక్నో పూర్తిగా పై చేయి సాధించిందన్నమాట. ఇవాల్టి మ్యాచ్లో కూడా లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది.

లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల అంచనా

లక్నో సూపర్ జెయింట్స్ అంచనా XII: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (WK/C), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రథి, శార్దుల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్/ఆకాష్ దీప్

ముంబై ఇండియన్స్ అంచనా XII: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్/ముజీబ్ ఉర్ రెహమాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుత్తూర్/సత్యనారాయణ రాజు

పంత్ కెప్టెన్సీ పై అందరిలోనూ టెన్షన్

27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పంత్ కెప్టెన్సీ పైన… అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ పెద్దగా రాణించలేదు. దాంతో లక్నో సూపర్ జెంట్స్ ఓడిపోతూ వస్తోంది. కాబట్టి ఇవాల్టి మ్యాచ్లో అయినా పంత్ ఆడాలని ఫాన్స్ కోరుతున్నారు. మరి ఇవాళ రిషబ్ పంత్ ఎలా ఆడతాడో చూడాలి.

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×