BigTV English

Longest Train Services: దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏకబిగిన ఎన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తాయో తెలుసా?

Longest Train Services: దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏకబిగిన ఎన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తాయో తెలుసా?

Longest Train Services In India: భారతీయ రైల్వే వ్యవస్థ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దేశ నలుదిక్కులనూ కలుపుతూ పెద్ద సంఖ్యలో రైల్వే లైన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం వేలాది రైళ్లు, కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు తీసుకెళ్తున్నాయి. వాటిలో కొన్ని అత్యంత దూరం ప్రయాణించే రైల్వే సర్వీసులు ఉన్నాయి. ఈ రైళ్లు ఏక బిగిన వేలాది కిలో మీటర్ల దూరాన్ని గంటల తరబడి ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుకుంటాయి.


భారత్ లో అత్యంత దూరం ప్రయాణించే రైలు సర్వీసులు

వివేక్ ఎక్స్ ప్రెస్


వివేక్ ఎక్స్ ప్రెస్ అస్సాంలోని డిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4 వేల 154కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 58 స్టేషన్లు దాటుతూ 75 గంటల పాటు ఏకబిగిన వెళ్తుంది.

సిల్చార్ ఎక్స్ ప్రెస్

ఈ రైలు అస్సోంలోని సిల్చార్ నుంచి కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 3 వేల 915 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 71 గంటల ప్రయాణం తర్వాత గమ్యస్థానానికి చేరుకుంటుంది. మొత్తం 57 రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.

హిమసాగర్ ఎక్స్ ప్రెస్

ఈ రైలు తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బయల్దేరి జమ్ములోని శ్రీమాత వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది. 3 వేల 787 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 68 గంటల్లో చేరుకుంటుంది. మొత్తం 65 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

జమ్ము ఎక్స్ ప్రెస్

ఈ రైలు తమిళనాడులోని తిరునల్వేలి నుంచి మొదలై శ్రీమాత వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 3,642 కిలో మీటర్ల దూరాన్ని 71 గంటల్లో చేరుకుంటుంది. మొత్తం 64 స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

నవయుగ ఎక్స్ ప్రెస్

ఈ రైలు కర్నాటక మంగళూరు సెంట్రల్ నుంచి జమ్ములోని తావి వరకు ప్రయాణిస్తుంది. 3 వేల 607 కీలో మీటర్ల దూరాన్ని ఈ రైలు 68 గంటల్లో చేరుకుంటుంది. మొత్తం 59 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

గౌహతి ఎక్స్ ప్రెస్

ఈ రైలు తిరువనంతపురం నుంచి గౌహతి వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 3 వేల 553 కిలో మీటర్ల దూరాన్ని 65 గంట్లో చేరుకుంటుంది.

దిబ్రుగఢ్ ఎక్స్ ప్రెస్

ఈ రైలు అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి కర్నాటకలోని యశ్వంత్ పూర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 3 వేల 547 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని రైలు 68 గంటల్లో చేరుకుంటుంది. మొత్తం 35 స్టేషన్లలో ఆగుతుంది.

రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్

ఈ రైలు కేరళ ఎర్నాకులం నుంచి బయల్దేరి బీహార్ లోని బరౌని వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 3 వేల 438 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు 62 గంటల పాటు ప్రయాణిస్తుంది. 62 స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: హాట్ బాత్, విమానం తరహా సౌకర్యాలు.. ‘వందే భారత్’ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు!

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×