BigTV English

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Virat Kohli error in judgement gets Rohit Sharma angry: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య… మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో 30 వ సెంచరీ చేసి రికార్డు బద్దలు కొట్టాలని విరాట్ కోహ్లీ… చాలా ఎదురు చూశాడు. కానీ అతనికి కాలం కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాప్ అయిన విరాట్ కోహ్లీ… రెండవ ఇన్నింగ్స్ లో కూడా… త్వరగానే పెవీలియన్ కు చేరాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ఎంపైర్ తప్పిదం కారణంగా విరాట్ కోహ్లీ బలి కావడం జరిగింది.


 

రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఎల్ బి డబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. ఎన్నో రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ… తన అవుట్ విషయంలో డిఆర్ఎస్ తీసుకోకపోవడం పట్ల… హిట్ మాన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా క్రికెటర్లు అందరూ షాక్ అవుతున్నారు. ఒక అడుగు ముందుకేసి రోహిత్ శర్మ అయితే… విరాట్ కోహ్లీని తిట్టినంత పని చేశాడు. రోహిత్ శర్మ కు సంబంధించిన.. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


బంగ్లా జట్టుకు సంబంధించిన మోహిద్ హసన్… ఓవర్ లో ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అయితే బంగ్లా ప్లేయర్ లందరూ అప్పీల్ చేయడంతో అక్కడే ఉన్న ఎంపైర్ రాడ్ టక్కర్… వెంటనే అవుట్ ఇచ్చాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు ఉన్న గిల్ మాత్రం… రివ్యూ తీసుకోవాలని విరాట్ కోహ్లీని కోరాడు. కానీ విరాట్ కోహ్లీ.. రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ కు చేరిపోయాడు.

Virat Kohli error in judgement gets Rohit Sharma angry
Virat Kohli error in judgement gets Rohit Sharma angry

దీంతో ఇప్పుడు ఈ వికెట్ వివాదంగా మారింది. అయితే విరాట్ కోహ్లీ వికెట్ ను ఒకసారి రిప్లై చూస్తే.. అది నాటౌట్ గా తేలిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా… దాదాపు 45 రోజుల తర్వాత.. గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. బంగ్లాదేశ్ పైన మొదటి రోజు నుంచి… ఆధిపత్యం చలాయిస్తోంది టీం ఇండియా జట్టు.

Also Read: Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు టీమ్ ఇండియా ఆల్ అవుట్ కావడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ అలాగే జడేజా లాంటి ఆల్ రౌండర్ల కారణంగా భారీ స్కోర్ దిశగా వెళ్ళింది టీమిండియా. అయితే.. బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ మాత్రం 149 పరుగులకే ఆల్ అవుట్ అయింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి రాణించాడు. ఈ అటు రెండవ ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా అద్భుతంగా రానిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉండడం జరిగింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×