BigTV English

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: టీమిండియా ట్రంప్ కార్డు.. జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో 400వ వికెట్ తీశాడు. అంటే మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు వేగంగా వికెట్లు సాధించిన భారత క్రికెటర్ల సరసన చేరాడు.


భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా కీలకమైన 4 వికెట్లు తీశాడు. అలా కెరీర్ లో 400 వికెట్ల క్లబ్ లో చేరాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ హసన్ మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా 400వ వికెట్‌ను అందుకున్నాడు. వెంటనే చక్కని యార్కర్‌తో తస్కిన్ అహ్మద్‌ను అవుట్ చేసి 401వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

బుమ్రా విజృంభణతో బంగ్లాదేశ్ విలవిల్లాడింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దగ్గర నుంచే బుమ్రా నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. అగ్నికి వాయువు తోడైనట్టు ఆకాశదీప్ కలిశాడు. తను వెంటవెంటనే 2 వికెట్లు తీశాడు. అంతే మ్యాచ్ లో వేగం పెరిగింది. బంగ్లాదేశ్ పతనం దిశగా సాగిపోయింది. మళ్లీ ఎక్కడా కోలుకోలేదు. మొత్తానికి బంగ్లాదేశ్ 149 పరుగులకి ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు.


Also Read: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

36 టెస్టు మ్యాచ్ లు, 69 ఇన్నింగ్స్ లో 163 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 70 టీ 20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఇవన్నీ కలిపి 401 వికెట్లు అయ్యాయి. ఇక 227 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ వికెట్లు సాధించడం విశేషం.

అంతేకాదు కెరీర్ లో వేగంగా 400 వికెట్ల క్లబ్ లో చేరిన 5వ భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. తను కేవలం 216 మ్యాచ్‌ల్లోనే 400 వికెట్లు సాధించాడు.

కపిల్ దేవ్ 220 మ్యాచ్ ల్లో సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ షమీ – 224 మ్యాచ్‌ల్లో సాధించి మూడో స్థానంలో, అనిల్ కుంబ్లే- 226 మ్యాచ్‌ల్లో సాధించి నాలుగో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత ఐదో స్థానంలో బుమ్రా నిలిచాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×