BigTV English

Top 5 Black SUV’s: స్టైలిష్‌గా కనిపించాలంటే ఇవే బెస్ట్ ఎస్యూవీలు.. ఈ కార్లోంచి దిగుతుంటే ఉంటది!

Top 5 Black SUV’s: స్టైలిష్‌గా కనిపించాలంటే ఇవే బెస్ట్ ఎస్యూవీలు.. ఈ కార్లోంచి దిగుతుంటే ఉంటది!

Best Black SUV’s in India Market: భారతీయ కార్ మార్కెట్ SUVలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఎస్యూవీ కార్లే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఎస్యూవీలలో చాలా మంది బ్లాక్ కలర్ మోడల్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని ప్రత్యేక మోడళ్లను అందుబాటులో ఉంచాం. అవేంటంటే..


Toyota Fortuner

Toyota Fortunerకి ఆటో మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. దాని లుక్, డిజైన్ పరంగా ఈ కారు అదిరిపోయే గిరాకీని అందుకుంటుంది. ఇది 2.7L నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లేదా పవర్‌ఫుల్ 2.8L డీజిల్‌తో అందించబడుతుంది. ఈ కార్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ల కోసం ఆప్షనల్ 4×4 సిస్టమ్‌తో అమర్చబడుతుంది. ఈ మోడల్ కార్ మార్కెట్‌లో దాని కలర్‌తో మంచి గుర్తింపు పొందింది.


Hyundai Creta

భారతదేశంలోని కాంపాక్ట్ SUVలలో తిరుగులేని రారాజు Hyundai Creta. ఈ కార్ స్టైలిష్ డిజైన్‌తో బ్లాక్ కలర్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటుంది. ఇది 1.5L పెట్రోల్, 1.5L టర్బో-పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్‌ల ఎంపికను అందించే ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. బ్లాక్ కలర్‌లో ఉన్న క్రెటా స్టైల్, ప్రాక్టికాలిటీ రెండింటినీ కోరుకునే వారికి బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు.

Mahindra XUV7OO

Also Read: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఒకేసారి 5 SUVs.. ఫీచర్లు పీక్స్!

ఇటీవల విడుదల చేసిన Mahindra XUV7OO బ్లాక్ వీల్స్, యాక్సెంట్‌లను కలిగి ఉన్న ప్రత్యేక ఎడిషన్‌తో బ్లాక్ బ్యాండ్‌వాగన్‌లో చేరింది. ఈ ఫీచర్-రిచ్ SUV 2.0L టర్బో పెట్రోల్ లేదా 2.2L డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దాని బోల్డ్ డిజైన్ బ్లాక్ కలర్‌లో అద్భుతంగా మంచి షైనింగ్‌గా కనిపించి వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది.

Tata Safari Dark Edition

టాటాలోని డార్క్ ఎడిషన్‌లు వాటి డ్రామాటిక్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, వీల్స్‌కు బాగా ప్రసిద్ధి చెందాయి. FIAT నుండి తీసుకోబడిన పవర్‌ఫుల్ 2.0L డీజిల్ ఇంజన్‌తో భారతదేశపు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన సఫారి డార్క్ కలర్‌లో అత్యద్భుతంగా ఆకట్టుకుంటుంది. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే, మిస్టరీని ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక.

Mahindra Scorpio N

Mahindra Scorpio N ఇప్పటికే పవర్‌ఫుల్‌గా గట్టి పరిమాణంతో ఉంది. ఇది బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వాహన ప్రియులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ SUV 2.0L టర్బో పెట్రోల్ లేదా 2.2L డీజిల్ ఇంజన్‌ను అందిస్తుంది. ఆప్షన్ 4×4 సిస్టమ్ దాని ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని జోడిస్తుంది. గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లపై కూడా ఈ కారు చాలా స్మూత్‌గా వెళ్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అనుభూతిని అందిస్తుంది. బ్లాక్ SUVలు భారతీయ రోడ్లపై మంచి లుక్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటాయి. అధునాతనత ఫీచర్లతో మంచి అనుభవాన్ని అందిస్తాయి. స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ బ్లాక్ ఎస్యూవీలు అత్యంత ప్రజాదరణ పొందినవి.

Tags

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×