BigTV English

Modi 3.0 Cabinet: కీలక పదవులు బీజేపీకే.. మరి మిత్రపక్షాల మాటేంటి..?

Modi 3.0 Cabinet: కీలక పదవులు బీజేపీకే.. మరి మిత్రపక్షాల మాటేంటి..?

Key Positions in Modis Cabinet for BJP Candidates what about Alliance..?: భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదవులు ఇస్తారన్న విషయంపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మిత్ర పక్షనేతలతో బీజేపీ అగ్ర నేతలు సంప్రదింపులు జరిపారు.


మోదీ 3.0 కేబినెట్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లు మిత్ర పక్షాల నేతలు చంద్రబాబు, ఏక్‌నాథ్ శిండే, నితీష్ కుమార్‌తో సంప్రదింపులు జరిపారు. కీలకమైన హోం శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు తమ వద్దనే ఉన్నట్లు బీజేపీ సంకేతాలిచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్, మనోహర్ లాల్, బసవరాజ్ బొమ్మై, సర్బానంద సోనోవాల్ మంత్రి పదవులు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్ నాథ్ ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.


Also Read: ముచ్చటగా మూడోసారి.. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది?

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే, మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్ ప్రధాని ప్రచండ, భూటాన్ ప్రదాని తోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్‌తో పాటు తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యాక్షుడు అహ్మద్ అఫీఫ్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలకు మోదీ ప్రమాణ స్వీకార ఆహ్వానం అందలేదని ఆ పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×