BigTV English

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Golden City: ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరే దానికి ఉండదు. గోల్డ్‌ రేట్ ఎంత పెరిగినా.. జనాలు కొనడానికి మాత్రం అసలు వెనుకాడరు. అది గోల్డ్‌కు ఉన్న క్రేజ్.. ఎర్త్ పైన గుర్తించబడిన పురాతన లోహాలలో బంగారం ఒకటి చరిత్రకారులు చెబుతుంటారు. బంగారం ఆవిష్కరణ సుమారు 5వేల ఏళ్ల క్రితం జరిగిందని విశ్వసిస్తుంటారు. ఏ లోహం రంగు మారినప్పటికీ.. బంగారం కలర్ మాత్రం మారదు. వేళ్ల ఏళ్ల క్రితం రాజుల కాలంలో అయినా.. ప్రస్తుత కాలంలో అయినా బంగారం మెరుపు మాత్రం తరగలేదు. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువ. ఇక మన భారతదేశంలో అయితే మగువలు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. అయితే ప్రపంచంలో గోల్డెన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారో మీకు తెలుసా..? ప్రపంచంలో మొత్తం బంగారంలో దాదాపు 40 శాతం గోల్డ్ అక్కడ నుంచే ఉత్పత్తి అవుతోందట.. అక్కడ కొన్ని వేల టన్నుల బంగారాన్ని వెలికితీస్తున్నారంట.. మరి అదెక్కడ.. అది ఎంత లోతులో ఉంటుంది.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే..


ఇది అద్భుతమైన బంగారు గని

దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ పెద్ద నగరం జోహన్నెస్‌బర్గ్. ఇది బంగారు నగరంలో ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని ‘గోల్డ్ సిటీ’గా పిలుస్తుంటారు. 1886వ సంవత్సరంలో ఈ అద్భుతమైన బంగారు గనిని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. ఈ బంగారు గనుల వల్ల జోహన్నెస్‌బర్గ్‌ను ఆఫ్రికా ఖండంలో ఆర్థిక కేంద్రంగా మార్చింది. ఈ సిటీ దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. వాణిజ్యం, ఆర్థిక సేవలు, గనుల పరిశ్రమలకు కేంద్రంగా నిలుస్తోంది. జోహన్నెస్‌బర్గ్ ఒక సాంస్కృతిక కేంద్రానికి కూడా ప్రఖ్యాతి గాంచింది.


40 శాతం బంగారం ఇక్కడి నుంచే…

ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటి. అలాగే లోతైన బంగారు నిల్వలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఈ గని నుంచి గత 130 ఏళ్లుగా బంగారం వెలికితీస్తున్నారు. ఇక్కడ ప్రపంచ బంగారు ఉత్పత్తిలో సుమారు 40% ఇక్కడ నుంచే సప్లై అవుతోందట. ఇక్కడ విట్వాటర్‌రాండ్ గనిలో దాదాపు 2,300 టన్నులు బంగారం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. 2017లో 8 టన్నులు, 2018లో 4.5 టన్నుల బంగారం ఇక్కడ నుంచి వెలికితీశారు. ఈ గని నుంచి 2092 వరకు బంగారం తవ్వే అవకాశం ఉందని అంచనా.

3వేల మీటర్ల లోతులో గని..

బంగారం బయటకు తీయడం అనేది శ్రమతో కూడిన ప్రక్రియ. జోహన్నెస్‌బర్గ్‌లోని గనులు, ముఖ్యంగా క్లోఫ్, డ్రైఫోంటైన్, సౌత్ డీప్, ఇంపాలా, త్షెపాంగ్ వంటి గనులు భూగర్భంలో 3,000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. బంగారం తవ్వకం కోసం ఆధునిక యంత్రాలు, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. మొదట, గనిలోని రాతిని పేల్చడం ద్వారా ఖనిజాలను వేరు చేస్తారు. ఈ రాతిని బయటకు తీసుకొచ్చి, ప్రత్యేక యంత్రాల ద్వారా బంగారాన్ని వేరు చేస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా సయనైడ్ లీచింగ్ లేదా ఫ్లోటేషన్ వంటి రసాయన పద్ధతులు ఉపయోగిస్తారు. ఇవి బంగారాన్ని శుద్ధి చేయడానికి తోడ్పడుతాయి.

క్రిమినల్ సిండికేట్ ద్వారా తవ్వకాలు..?

అయితే, ఈ గనులలో అక్రమ తవ్వకాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇవి క్రిమినల్ సిండికేట్‌ల ద్వారా తవ్వకాలు జరుపుతున్నట్టన అక్కడ ప్రభుత్వం ఆరోపిస్తుంది.. ఈ అక్రమ కార్యకలాపాలు హింసాత్మక ఘర్షణలకు దారితీస్తాయి. గనులలో పనిచేసే కార్మికులు తరచూ ప్రమాదకర పరిస్థితులలో పనిచేయాల్సి ఉంటుంది, ఇది వారి జీవన పరిస్థితులను ఇబ్బందులకు గురిచేస్తోంది. జోహన్నెస్‌బర్గ్‌లో బంగారం మెరుపు వెనుక ఆర్థిక అసమానతలు సామాజిక సమస్యలు కూడా నెలకొన్నాయి. అయినప్పటికీ ఈ నగరం బంగారం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది.

⦿ వేల టన్నుల బంగారు నిల్వలు

జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది విట్వాటర్‌రాండ్ గని సమీపంలో ఉంది. ఈ గనిలో సుమారు 82 మిలియన్ ఔన్సులు (దాదాపు 2,300 టన్నులు) బంగారం నిల్వలున్నట్లు అంచనా వేస్తున్నారు.. ఈ గని నుంచి ప్రపంచ బంగారు ఉత్పత్తిలో 40% ఇక్కడ నుంచే సప్లై అవుతోందట.

⦿ 2017లో: 281,300 ఔన్సులు (8 టన్నులు) బంగారం ఉత్పత్తి అయ్యింది

⦿ 2018లో: 157,100 ఔన్సులు (4.5 టన్నులు) బంగారం ఉత్పత్తి అయ్యింది

అంచనా: 2092 వరకు బంగారాన్ని వెలికి తీసే అవకాశం ఉంది..

⦿ తవ్వక పద్ధతులు

జోహన్నెస్‌బర్గ్‌లోని గనులు (క్లోఫ్, డ్రైఫోంటైన్, సౌత్ డీప్, ఇంపాలా, త్షెపాంగ్) భూగర్భంలో 3,000 మీటర్ల లోతు వరకు ఉన్నాయి.

⦿పేలుడు: డైనమైట్‌తో రాతిని వేరు చేస్తారు..

⦿ఖనిజాన్ని వేరుచేయడం: రాతిని బయటకు తీసుకొచ్చి, యంత్రాల ద్వారా బంగారాన్ని వేరు చేస్తారు.

⦿శుద్ధీకరణ: సయనైడ్ లీచింగ్ లేదా ఫ్లోటేషన్ వంటి రసాయన పద్ధతుల ద్వారా బంగారాన్ని శుద్ధి చేస్తారు.

⦿ప్రమాదకర పరిస్థితులు: కార్మికులు చీకటి సొరంగాలలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తారు.

ALSO READ: AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

Related News

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×