కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల్లో కొన్ని పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా మందికి తెలియదు కానీ ఆ పథకాల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నిజానికి చిన్న పిల్లల కోసం ఎలాంటి పథకాలు అందుబాటులో లేవు అనుకుంటారు. కానీ చిన్న పిల్లల కోసం కూడా పథకాలు ఉన్నాయి. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం నెలకు రూ.833 కడితే కోట్లు వచ్చే పథకం ఒకటి ఉంది. మోదీ సర్కార్ తీసుకువచ్చిన బెస్ట్ స్కీమ్ లలో అది కూడా ఒకటి.. అదే వాత్సల్య స్కీమ్. ఈ స్కీమ్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో లాభాలు ఉన్నాయి.
Also read:కేసీఆర్ నీ కంట కన్నీరైనా వచ్చిందా.. 21 ఏళ్లకే ఎమ్మేల్యే గా పోటీకి ఛాన్స్.. సీఎం రేవంత్ రెడ్డి
ఒకవేళ తల్లి దండ్రులు తమ పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలని అనుకుంటే ఇది చాలా మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. 17 ఏళ్ల లోపు పిల్లల పేర్లపై వాత్సల్య అకౌంట్ ఎపెన్ చేసే అవకాశం ఉంటుంది. నెలకు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి తిరిగి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. కేవలం రోజుకు రూ.166 చొప్పున నెలకు రూ.5000 పొదుపు చేస్తే రూ.40 లక్షలు పొందవచ్చు.
ఈ పథకంలో ఏడాదికి రూ.10వేల చొప్పున 60ఏళ్ల పాటు పొదుపు చేస్తే రూ.10 కోట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా నెలకు కేవలం రూ.833 చెల్లిస్తే పద్దెనిమిదేళ్లకు రూ.1.8 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై పదిశాతం రిటర్న్స్ వస్తే రూ.5 లక్షలు అవుతాయి. అరవై ఏళ్లు మొత్తం పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. దీనిపై రిటర్న్స్ అయితే 2.7 కోట్లు అవుతాయి. 11.59 శాతంతో 5.97కోట్లు , 12.86 శాతంతో 11.5 కోట్లు లబ్దిదారులకు అందుతాయి. మనం జమ చేసే డబ్బును షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తాలను పొందవచ్చు.