Allu Arjun: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి తో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో నేడు పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగే వరకు సాగింది. అయితే అల్లు అర్జున్ తన కెరియర్ లో ఒక సినిమాను మించి మరొక సినిమాను చేసుకుంటూ ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యాడు. ముఖ్యంగా ప్రతి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాడు. అలానే సినిమాల విషయంలో కూడా మంచి కథలను ఎంచుకున్నాడు. కొన్నిసార్లు అల్లు అర్జున్ చేసిన సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ, ఒక నటుడుగా అల్లు అర్జున్ ఇప్పుడు ఫెయిల్ కాలేదు. అయితే ఆడియన్స్ లో ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ చాలామంది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు కూడా, ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అప్పట్లో గోవాలోని ఒక వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లు ఒక వీడియో వైరల్ గా మారింది.
అయితే మొదటి చాలామంది ఈ వీడియో అల్లు అర్జున్ కి సంబంధించింది కాదు అని అనుకున్నారు. కొంతమంది మాత్రం ఇది షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ తీసుకున్నాడు అంటూ వాదన చేశారు. ఇంకొంతమంది ఖచ్చితంగా అల్లు అర్జున్ పర్సనల్ గా వెళ్లి కొనుక్కొని తెచ్చుకున్నాడు అంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఏదేమైనా గాని దాని గురించి ఇప్పటివరకు సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ఏకంగా దీని గురించి అల్లు అర్జున్ స్పందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ అని షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన నాలుగువ సీజన్ మొదలైంది. మొదటి మూడు సీజన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో హిట్ అయ్యాయి. ఇక ఈ సీజన్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. దీనిలో ఆ వీడియోకి సంబంధించి అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Samantha – Naga Chaitanya: చైతన్యకు ఆ పాడు అలవాటు… వద్దు అంటేనే సామ్‌తో డైవర్స్..?
అన్ స్టాపబుల్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట ఈ షో కి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అంతకుముందు కొన్ని స్టేజెస్ లో బాలయ్య మాట్లాడే విధానాన్ని బట్టి, చాలా సందర్భాల్లో బాలయ్య మాట్లాడుతూ తడబడుతూ ఉండేవాళ్ళు. అప్పటికే బాలయ్య బాబు మీద చాలామందికి ఉన్న అభిప్రాయం వేరు. ఇప్పుడు చాలామందికి బాలయ్య బాబు మీద ఉన్న అభిప్రాయం వేరు. ఆ షో తర్వాత బాలకృష్ణకు విపరీతమైన పాజిటివ్ వచ్చింది. ఆ షో తర్వాత బాలకృష్ణ ఏకంగా మూడు హ్యాట్రిక్ సినిమాలను చేశారు. చాలామంది యంగ్ హీరోస్ తో బాలకృష్ణ ఎంత క్లోజ్ గా ఉంటారు అని ఆ షో చూసిన తర్వాతే చాలామందికి అర్థమైంది.