BigTV English

Kanguva Disaster: రూ. 2000 కోట్లు అంటివి కదరా.. ఎక్కడ ఉన్నావ్ రాజా

Kanguva Disaster: రూ. 2000 కోట్లు అంటివి కదరా.. ఎక్కడ ఉన్నావ్ రాజా

Kanguva Disaster:  ఈమధ్యకాలంలో  ఒక సినిమా హిట్ కావడానికి ఏం కావాలి.. ? అని ప్రశ్న ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వచ్చే మొదటి సమాధానం కథ అని ఉంటుంది. డైరెక్టర్ ఎవరు.. ? స్టార్ హీరోనా.. ? చిన్న హీరోనా.. ? అది తెలుగు సినిమానా.. ? లేక డబ్బింగ్ సినిమానా.. ? వాళ్లు ప్రమోషన్స్ చేశారా..? లేదా.. ? ఇలాంటివేమీ ఒక ప్రేక్షకుడు చూడడు. థియేటర్ కు వెళ్తే.. మూడు గంటలు సీట్ లో బోర్ కొట్టనివ్వకుండా చేయగలిగారా.. ?  ఇది ఒక్కట్టే ప్రేక్షకులు చూస్తున్నారు. ఒకప్పుడు ఉన్న జనరేషన్ కాదు ఇది. ఎలివేషన్స్ పెట్టేసి, హీరోతో ఫైట్స్ చేయించి.. ఫ్యాన్స్ కు కావాల్సింది ఇదే కదా అని అనుకుంటే  ప్లాప్ లో కాలు వేసినట్టే.  ఇప్పుడు జనరేషన్ మారింది. కథ నచ్చకపోతే  ఫేవరేట్ హీరో అయినా కూడా నిర్మొహమాటంగా బాలేదని చెప్పుకొచ్చేస్తున్నారు.


తాజాగా కంగువా విషయంలో కూడా ఫ్యాన్స్ ఇదే టాక్ చెప్పుకొస్తున్నారు. కోలీవుడ్  స్టార్ హీరో సూర్యకు తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. దానికి మించి తెలుగులో ఉందని చెప్పాలి. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా  కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. సూర్య సైతం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. 2021 లో జై భీమ్ అనే సినిమాతో ఓటీటీలోకి వచ్చాడు సూర్య. ఈ సినిమా  మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ET అనే సినిమాతో వచ్చాడు. అది భారీ డిజాస్టర్ ను అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు సోలో హీరోగా సూర్య కనిపించింది లేదు. మధ్యలో విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా క్యామియోలో కనిపించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే అది మొత్తం కమల్ ఖాతాలోకి పోతుంది.

Thriller Movie OTT : మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. అరాచకం ఈ మూవీనే..


దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత సూర్య.. కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  తెలుగులో యావరేజ్ సినిమాలు, తమిళ్ లో ఒక మోస్తారు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై KE జ్ఞానవేల్ రాజా.. యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మించాడు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాను నిర్మిస్తుంటే.. మేకర్స్ ఒకటికి వంద కల్పించి హైప్ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. సినిమాపై అంచనాలను పెంచడానికి మా సినిమా హిట్ అవ్వకపోతే  మేము సినిమాలు తీయడం మానేస్తాం.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. వంద కోట్ల సినిమా.. మా హీరో అదరగొట్టేసాడు.. లాటి మాటలు ప్రమోషన్స్ లో వింటూనే ఉంటాం.

సినిమాపై  హైప్ పెంచడానికి అలా మాట్లాడడంలో కూడా తప్పు లేదు. కానీ, కంగువా ప్రమోషన్స్ లో KE జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు మాత్రం హైప్ కాదు.. ఓవర్ హైప్ ను తీసుకొచ్చిపెట్టాయి. నిజం చెప్పాలంటే.. సగం ఆయన చేసిన వ్యాఖ్యల వలనే ఈ సినిమా మరింత ట్రోలింగ్ కు గురవుతుంది. అంతగా ఏమన్నాడు.. ? అని ఆలోచిస్తున్నారా.. ? సరే చెప్తాము రండి. ఒక ఇంటర్వ్యూలో సూర్య కంగువా ఎలా ఉండబోతుంది అంటే.. రూ. 2000 కోట్లు రికార్డ్ లు కొల్లగొడుతుందని చెప్పుకొచ్చాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలే అంత సాధించలేదు.  ఇది అంతకుమించి  సాధిస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎక్కువ అంచనాలను పెట్టుకున్నారు.

Sravanthi Chokarapu: హాస్పిటల్ బెడ్ పై హాట్ యాంకర్.. బ్లీడింగ్ ఆగడం లేదంటూ..

ఇక ఇంకోపక్క సూర్య సైతం.. నిర్మాత రూ. 2000 కోట్లు రాబడుతుంది అన్నాడు.. మీరేమంటారు అని అడిగితే.. కలలు కనడం తప్పుకాదు కదా అని ఒకే ఒక్క డైలాగ్  అనేసి ఇంకా సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇంతమంది ఈ రేంజ్ లో హైప్ ఇస్తే.. సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని మైండ్ నిండా  అంచనాలను పెట్టుకొని థియేటర్ లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన ప్రేక్షకుడు ఉసూరుమంటూ బయటకు వచ్చాడు.

సూర్యలాంటి స్టార్ హీరోతో శివ క్రింజ్ కామెడీ చేయించాడు. యాక్టింగ్ అంటే సూర్య.. సూర్య అంటే యాక్టింగ్.. అలాంటి హీరోతో ఓవర్ యాక్షన్ చేయించాడు. మొదట  20 నిమిషాలు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు అదంతా పెట్టాడో తెలియదు. ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అని  ఫ్యాన్స్ ను ఎదురుచూసేలా చేశాడు. సరే సెకండాఫ్ అయినా బావుంటుందేమో అని చూస్తే.. అది కూడా లాగ్ ఎక్కువ.. కథ తక్కువ అన్నట్లు ఉంది. సూర్య అరుపులు తప్ప  ఏమి లేదు అని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

Robinhood Teaser: రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు

ఇక ఈ సినిమా కోసమేనా ఇన్నేళ్లు ఎదురుచూసింది. దీనికెందుకు సెకండ్ పార్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 2000 కోట్లు అన్న నిర్మాతను ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. రూ. 2000 కోట్లు అంటివి కదరా.. ఎక్కడ ఉన్నావ్ రాజా..  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా సూర్యకు ఈ సినిమా విజయాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి. మరి కలక్షన్స్ పరంగా ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×