BigTV English

Swiggy And IRCTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్

Swiggy And IRCTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్

Swiggy And IRCTC


Swiggy And IRCTC : రైలులో లాంగ్ జర్నీలు చేసేటప్పుడు సరైన ఆహారం దొరకు. దీంతో చాలా మంది ప్రయాణికులు నానా తంటాలు పడుతుంటారు. రుచికరమైన భోజనం కోసం ప్రతి స్టేషన్లో తొంగి చూస్తుంటారు. చివరకు ఏదీ దొరకపోవడంతో ఏదో స్నాక్స్‌తో ఆ పూట గడిపేస్తుంటారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట ఇంట్లో ఎలాగైతే మనకు నచ్చిన ఫుడ్‌ను తెప్పించుకుని తింటామో.. అలాగే రైళ్లలో కూడా మనకు కావాల్సిన ఫుడ్ ను ఆర్డర్ చేయొచ్చు. ఈ మేరకు ఐఆర్టీసీ- స్విగ్గీల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 12 నుంచి ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.

ముందుగా ఈ సేవలు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్నిస్టేషన్లలో మాత్రమే ప్రారంభం కానున్నాయి. విశాఖ పట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరులలో ఈ స్విగ్గీ సర్వీసు సేవలు ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఆ తర్వాత వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఎంపిక చేసిన నాలుగు స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచే రెండు స్టేషన్లు ఉండడం గమనార్హం.


READ MORE : యూపీఐ లావాదేవీలపై ఫీజు​ వేస్తారా..?

రైలు నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్టీసీ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. అందులో పీఎన్ఆర్ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను నచ్చిన స్టేషన్‌లో తీసుకోవచ్చు. ఈ ఒప్పందంతో రైల్వే ప్రయాణికులు మరింతగా ఎంజాయ్ చేస్తారని ఐఆర్టీసీ అభిప్రాయపడుతుంది.

READ MORE : యాపిల్ సంస్థకు రూ.16,500 కోట్ల ఫైన్.. ఎందుకంటే!

స్విగ్గీ కూడా ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తుంది. కస్టమర్ల రెస్పాన్స్‌ను బట్టి మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను విస్తరిస్తామని కూడా రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆయా స్టేషన్ల మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ట్రైన్లు వెళ్తుంటాయి. లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు.

స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే రానున్న కొద్ది రోజుల్లోనే మరో 59 స్టేషన్లలో ఈ ఫుడ్ డెలివరీ సేవలను స్విగ్గీ ప్రారంభిస్తుందిని తెలిపారు. సేవలు విస్తరించేందుకు తమకు అవకాశం లభిస్తుందన్నారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×