BigTV English

UPI Payments Transaction Fee : యూపీఐ లావాదేవీలపై ఫీజు​ వేస్తారా..?

UPI Payments Transaction Fee : యూపీఐ లావాదేవీలపై ఫీజు​ వేస్తారా..?

UPI payments transaction fee


UPI Payments Transaction Fee : ఇండియా యూపీఐ చెల్లింపుల్లో దూసుకుపోతుంది. గత కొద్దికాలంగా ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. 5-6 ఏళ్లలో ఆన్‌లైన్ పేమెంట్స్, షాపింగ్స్ కూడా పెరిగాయి. యూపీఐ చెల్లింపులు ప్రతి గ్రామంలోనూ విస్తరించాయి. దేశంలో డిజిటల్ రివల్యూషన్‌కు యూపీఐ చెల్లింపులు కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పుడు దాదాపు అందరి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ఉన్నాయి.

ఇదంతా బాగనే ఉంది కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ ‌పై ఫీజు వేస్తే ఎలా ఉంటుంది. ఇలా జరిగితే యూపీఐని ఎంతమంది ఉపయోగిస్తారు. అనే విషయంపై లోకల్ సర్కిల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే జరిపింది. ఆ సర్వే గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. యూపీఐ పేమెంట్స్‌కి ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తే యూపీఐ యాప్స్ వాడటం ఆపేస్తామని కొందరు చెప్పారు. మరికొందరైతే ఇప్పటికే తమపై యూజర్ ఛార్జీ పడుతుందని చెప్పుకొచ్చారు.

READ MORE :  ఫ్లిప్ కార్ట్ మరో ముందడుగు.. యూపీఐ సేవలు ప్రారంభించిన ఈకామర్స్ సంస్థ..

యూపీఐ వాడటానికి ఫీజు వసూల్ చేస్తే.. వాటిని వాడమని 7 శాతం ప్రజలు తేల్చేశారు. ఇదే మాటను మెజారిటీ ప్రజలు చెప్పారు. ట్రాన్సాక్షన్ ఫీజు వేసినా కూడా.. యాప్స్ వాడకాన్ని కొనసాగిస్తామని 23 శాతం మంది పేర్కొన్నారు.

లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని 364 జిల్లాలకు చెందిన 34 వేల ప్రజలు పాల్గొన్నారు. ఇందులో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు.

అంతేకాకుండా సర్వేలో పాల్గొన్నవారు.. గడిచిన 12 నెలల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు యూపీఐ పేమెంట్స్ చేయలేదని వెల్లడించారు. ట్రాన్సాక్షన్​ ఫీజు పడుతుందని 37 శాతం మంది స్పష్టం చేశారు. నిజానికి యూపీఐ యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ప్రతి ఇద్దరిలో ఒకరు నెలలో 10 సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది.

యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి 2022లో ఆర్​బీఐ విడుదల చేసిన ఓ డిస్కషన్​ పేపర్ విడుదల చేసింది. యూపీఐ పేమెంట్స్‌కు ఫీజు వసూలు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రతిపాదిస్తూ.. చర్చకు ఆహ్వానించింది. ఈ వ్యవహారంపై ఆర్థికశాఖ స్పందిస్తూ.. యూపీఐ ట్రాన్సాక్షన్‌పై ఎటువంటి ఫీజులు వసూల్ చేయమని తెలిపింది.

READ MORE : హీరో విడా వి1 ప్లస్ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు

యూపీఐ చెల్లింపులు ఇక ఉచితం కాదంటూ వస్తున్న వార్తలను ఎన్‌పీసీఐ ఖండించింది. వాలెట్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా జరిగే చెల్లింపులకు మాత్రం 1.1 శాతం ఇంటర్ చేంజ్ చార్జి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రుసుము కూడా రూ.2 వేల పైబడిన లావాదేవీలకు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు జరిపే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదని పేర్కొంది.

బ్యాంక్ ఖాతాలతో లింక్ అప్ అయిన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా లభించే సేవలు ఇకపై కూడా ఉచితంగానే లభిస్తాయని చెప్పింది. యూపీఐ పేమెంట్స్ విశ్వసనీయమైన, వేగవంతమైన చెల్లింపుల విధానమని ఎన్పీసీఐ తెలిపింది. ప్రతీ నెల ఇండియాలో 800 కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉచితంగా జరగుతున్నాయని స్పష్టం చేసింది.

Tags

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×