E-Paper
Advertisement

NFBS Scheme: కన్నీరు తుడిచే స్కీమ్.. కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే రూ.20,000 జమ!

NFBS Scheme: కన్నీరు తుడిచే స్కీమ్.. కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే రూ.20,000 జమ!
Advertisement

NFBS Scheme: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంటే ఎమిటి? దీన్ని ఎందుకు ప్రవేశ పెట్టారు దీనివలన కలిగే లాభాలు ఏమిటి? అనే వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పథకంపై గురించి ప్రజల్లోఅవగాహన లేక చాలా మంది ప్రజలు దీని ద్వారా వచ్చే లాభాలను పోందలేక పోతున్నారు. తెలంగాణలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(National Family Benefit Scheme) అనేది కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒక వేల అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ద్వారా చనిపోయిన యజమాని కుటుంబానికి రూ.20,000 రూపాయల ఆర్థిక సాహయంను కేద్ర ప్రభుత్వం అదిస్తుంది. ఈ పథకం దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో 2017 నుండి అమలులో ఉంది.

ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావాలసిన అర్హతలు

జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు(NFBS) అప్లై చేసుకోవాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాల నుండి, గరిష్ట వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. దారిద్ర్యరేఖకు దిగువన (BPL) పేదవారై ఉండి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 60,000 వేల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారిని దీనికి అర్హులుగా పేర్కోంటారు. అయితే కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒక వేల అనారోగ్య కారణంగా లేదా.. ఏదైన ప్రమాదం లేదా సహజ కారణాల వల్ల మరణిచి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసే టప్పుడు ముఖ్యంగా వ్యక్తి మరణం జరిగిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి మరణ దృవీకరణ పత్రంతో పాటు, కులం, ఆదాయ ద్రువీకరనణ పత్రాలు, కుటుంబ సభ్యుల ఆదార్ ఖార్డులు, రేషన్ కార్డు, మూడు ఫోటోలతోపాటు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను జతపరచాలి.

Advertisement

Also Read: Mahesh Babu: అప్పుడు మాస్టర్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

75 రోజుల లోపు ఆర్థిక సహాయం

లబ్దిదారుడి పూర్తి పత్రాలతో వారి ప్రాంతంలో సంబంధిత గ్రామ సెక్రటరీ లేదా మున్సిపల్ అధికారులకు దరఖాస్తు సమర్పించాలి. అనంతరం వాటిని రెవెణ్యూ, తహసిల్ధార్, సంబందిత అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. అనంతరం వాటిని అధికారులు సెర్ప్ సీఈఓ కి పంపించగా వాటిని ఆమోదం పొందుతుంది. అనంతరం కుటుంబ సభ్యుడికి నామినీగా ఉన్నటువంటి వ్యక్తి ఖతాలో20,000 రూపాయలను జమచేస్తారు. ప్రభుత్వ నియమాల ప్రకారం సదారణంగా దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 75 రోజుల లోపు వారికి ఆర్థిక సహాయం అందించాలి. ఒక వేల అప్పటి లోపు సహాయం అందకపోతే, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి కమిటీ తక్షణమే ఆమోదం ఇవ్వాలి. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించబడుతుంది, తద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయబడతాయి.

Advertisement

Also Read: BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×