BigTV English

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

మన దేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961లో అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ చట్టాన్ని అనుసరించే మనం పన్నులు చెల్లిస్తూ వస్తున్నాం. అయితే ప్రతి ఏడాదీ బడ్జెట్ లో పన్ను మినహాయింపులు, ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితులను ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఆదాయపు పన్ను చట్టాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ బిల్ -1961 స్థానంలో ఇన్ కమ్ ట్యాక్స్ బిల్ -2025 అమలులోకి రాబోతోంది. ఈ బిల్లుని ఫిబ్రవరి 13న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టగా దానికి కొన్ని సవరణలను సభ్యులు సిఫారసు చేశారు. కీలక మార్పులు చేస్తూ రెండోసారి తీసుకొచ్చిన బిల్లుకు తాజాగా లోక్ సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ‌లో కూడా ఈ బిల్ పాస్ అయితే చట్టంగా మారుతుంది.


2026 ఏప్రిల్-1 నుంచి అమలులోకి..!
సోమవారం లోక్ సభలో సవరణలతో కూడిన ఇన్ కమ్ ట్యాక్స్ బిల్ -2025ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఈ బిల్ ఆమోదం పొందింది. సెలక్షన్ కమిటీ చేసిన సవరణలకు కూడా ఆమోదం లభించినట్టయింది. వాస్తవానికి 1961లో రూపొందించిన ఇన్‌ కమ్ ట్యాక్స్ చట్టానికి 66 బడ్జెటల్లో పలు సవరణలు చేశారు. ఈసారి సవరణలు కాకుండా ఏకంగా చట్టాన్నే మార్చేశారు. రాజ్యసభ ఆమోదం పొంది ఈ బిల్లు చట్టంగా మారితే 2026, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

కొత్త బిల్లులో ఏముంది..?
పాత చట్టం 1961లో లాస్ట్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ అనే పదాలు ఉండగా.. కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదం వచ్చి చేరింది. ట్యాక్స్ శ్లాబ్ ల విషయంలో మార్పులేవీ ఉండవు. ఆదాయపు పన్ను శ్లాబ్ లు అమలులో ఉన్నవే కొనసాగుతాయి. ITR ఫైలింగ్ గడువు, పన్ను శ్లాబులు, మూల ధన లాభాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌ క్యాష్మెంట్ వంటివి పాత చట్టంలో వేర్వేరు సెక్షన్లు, నిబంధనల కింద ఉండగా.. ఇప్పుడవన్నీ ఒకే సెక్షన్ లోకి వచ్చేలా చేశారు.


ఇన్‌ కమ్‌ ఫ్రమ్‌ హౌస్‌ ప్రాపర్టీ
అద్దె ద్వారా సంక్రమించే ఆదాయం నుంచి మున్సిపల్‌ పన్నులను మినహాయించిన తర్వాతే ప్రామాణిక మినహాయింపు అంటే స్టాండర్డ్‌ డిడక్షన్‌ వర్తించేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి హోమ్‌ లోన్‌ తీసుకుంటే.. ఆ లోన్‌ పై చెల్లించే వడ్డీకి డిడక్షన్‌ క్లెయిమ్ చేసుకోవదం పాత పద్ధతే. ఇంటి నిర్మాణ కాలంలో చెల్లించిన వడ్డీని ఐదేళ్లలో 5 సమాన భాగాలుగా క్లెయిమ్ చేయవచ్చు. 30శాతం స్టాండర్డ్ డిడక్షన్, మున్సిపల్ ట్యాక్స్ లు, హోమ్ లోన్ పై కట్టే వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు మేలు చేసేలా.. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆస్తులు, ఖాళీ చేసిన ఆస్తులపై వడ్డీ తగ్గించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానం కింద కార్పొరేషన్లు కూడా ఇప్పుడు సెక్షన్ 80ఎం కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీలకు సంబంధించి మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (మ్యాట్) వర్తిస్తుంది. ధార్మిక సంస్థలకోసం వినియోగించే మూలధన లాభాలను ఇకనుంచి అప్లికేషన్ ఆఫ్ ఇన్ కమ్ గా పరిగణిస్తారు. ట్రస్ట్ లు గతంలో తమకు వచ్చిన ఆదాయంలో 15శాతాన్ని నిర్దిష్ట పద్ధతుల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఇలాంటి అవసరం లేదు. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసేవారు కూడా ఇప్పుడు రిఫండ్‌ కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

Related News

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Big Stories

×