OTT Movie : సెరిబ్రల్ పాల్సీ అనే జబ్బు ఉన్న అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ జబ్బు పడ్డ వాళ్ళు మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి జబ్బు ఉన్న ఒక టీనేజ్ అమ్మాయితో, ఆమె తండ్రి ఎదుర్కొనే సవాళ్ల గురించి ఈ కథ చెబుతుంది. ఈ సినిమా హృదయాన్ని టచ్ చేసే ఒక మాస్టర్‌పీస్. ఈ సినిమాకి Zee Cine Awards లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్, Ananda Vikatan Cinema అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్, యువన్ శంకర్ రాజాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘పేరంబు’ (Peranbu) 2018లో వచ్చిన మలయాళ ఎమోషనల్ డ్రామా సినిమా. దీనికి రామ్ దర్శకత్వం వహించారు. P.L. థెనప్పన్ దీనిని నిర్మించాడు. ఇందులో మమ్ముట్టి (అముదవన్), అంజలి (విజయలక్ష్మి), సదనా (పాపా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 147 నిమిషాల రన్‌టైమ్‌తో, తెలుగు, తమిళం, మలయాళం సబ్‌టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ సినిమా IMDb లో 8.5/10 రేటింగ్ ని కూడా పొందింది.
స్టోరీలోకి వెళితే
అముదవన్ (మమ్ముట్టి) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. తన భార్య స్టెల్లా (లిజ్జీ ఆంటోనీ) 14 ఏళ్ల కూతురు పాపా (సదనా) ఇండియా లో ఉంటారు. అయితే పాపాకి సెరిబ్రల్ పాల్సీ స్టెల్లా అనే జబ్బు ఉంటుంది. దీనివల్ల కుటుంబం మొత్తం బాధపడుతుంటుంది. పాపాని చూసుకోలేక, అముదవన్‌కి లేఖ రాసి కుటుంబాన్ని వదిలేసి స్టెల్లా పారిపోతుంది. అముదవన్ 10 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చి, సింగిల్ ఫాదర్‌గా పాపాని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. పాపా ఆరోగ్య పరిస్థితి వల్ల సమాజం వాళ్లని రిజెక్ట్ చేస్తుంది. అముదవన్‌కి ఆమెతో బాండింగ్ కష్టమవుతుంది. వాళ్లు అముదవన్ సోదరుడు ఇంటికి వెళ్తారు. కానీ సోదరుడి భార్య పాపా వ్యాధి తన బిడ్డకి వస్తుందని భయపడి వాళ్లని బయటకు పంపేస్తుంది. అముదవన్, పాపాతో కొడైకెనాల్‌లోని ఒక సీక్రెటెడ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్లు నెమ్మదిగా దగ్గరవుతారు. పాపాకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుంది. అముదవన్ ఆమెను ఓదార్చి, విజయలక్ష్మి (అంజలి) అనే స్త్రీ సహాయం తీసుకుంటాడు.
Read Also : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు