OTT Movie : హృదయాన్ని తడమగలిగే ఒక చిన్న కథ ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక ప్రేమలేఖ చుట్టూ తిరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రేమ, గందరగోళం, ఎమోషన్స్ మిక్స్ అవుతూ, ఇది ప్రేక్షకులకు ఒక ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో యాంకర్ స్రవంతి చొక్కారపు ప్రధాన పాత్రలో నటించారు. ఇది ‘కథా సుధా’ సిరీస్‌లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలోకి వచ్చిందంటే
‘దొరికిన ప్రేమలేఖ’ (Dorikina Premalekha) “కథా సుధా” సిరీస్‌లో వచ్చిన తెలుగు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్. కొండ రాంబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో స్రవంతి చొక్కారపు, సిద్ధు దివాకర్, విరాజిత ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 ఆగస్టు 10 నుంచి ETV Win లో 35 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. స్రవంతి నటనకు “కథా సుధా” సిరీస్‌లో మంచి గుర్తింపు వచ్చింది.
స్టోరీలోకి వెళితే
అర్జున్ (సిద్ధు దివాకర్) కాలేజీలో సంజనా (విరాజిత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లదు. ఆ తర్వాత అర్జున్, స్వాతి (స్రవంతి చొక్కారపు)ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటాడు. స్వాతి ఒక ఫ్రీ-స్పిరిటెడ్, అర్థం చేసుకునే భార్య. కానీ ఒక రోజు సంజనాకు అర్జున్ రాసిన పాత ప్రేమలేఖ స్వాతికి దొరుకుతుంది. ఈ లేఖ స్వాతిలో క్యూరియాసిటీ, కొంచెం డౌట్‌ని రేకెత్తిస్తుంది. ఆమె అర్జున్ గత ప్రేమ గురించి తెలుసుకోవాలని, సంజనా ఎవరో కనిపెట్టాలని డిసైడ్ అవుతుంది. అర్జున్ ఫ్రెండ్ రోహిత్, స్వాతికి సంజనా గురించి కొన్ని క్లూస్ ఇస్తాడు. కానీ అది కథను మరింత గందరగోళం చేస్తుంది.
Read Also : మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ … కొంచెం రక్తపాతం, కొంచెం కామెడీ …పక్కా ఎంటర్టైనర్