BigTV English
Advertisement

Car Servicing Tips: కార్ సర్వీస్ చేయిస్తున్నారా.. ఈ టిప్స్ పాటించడం మర్చిపోకండి!

Car Servicing Tips: కార్ సర్వీస్ చేయిస్తున్నారా.. ఈ టిప్స్ పాటించడం మర్చిపోకండి!

Car Servicing Tips: కారు కొనుగోలు చేయడం కాదు, దాని సర్వీస్ కూడా ముఖ్యమే. ఎందుకంటే కారును తరచుగా వినియోగించే కొద్ది దాని ఇంజన్, కొన్ని పార్ట్స్ పాడయిపోయే అవకాశం ఉంది. దీని ద్వారా దూర ప్రయాణాలు చేసే క్రమంలో ఒక్కసారిగా సమస్యలు తలెత్తేవచ్చు. ఈ క్రమంలో  మీరు మీ కారును సర్వీసింగ్ చేయాలనుకుంటున్నారా? లేదా ఇటీవల సర్వీస్ కోసం వెళుతున్నట్లయితే మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా  మీ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


Engine Oil
మీ కారును సర్వీసింగ్ చేసే ముందు సరైన ఇంజన్ ఆయిల్‌ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇంజన్ పర్ఫెక్ట్‌గా రన్ అవడానికి కారు మాన్యువల్‌లో ఇచ్చిన సిఫార్సుల ప్రకారం సరైన ఇంజన్ ఆయిల్‌ను ఎంచుకోండి.

Also Read: BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్


Odometer
సర్వీసింగ్ సమయాన్ని ట్రాక్ చేయడానికి మీ కారు ఓడోమీటర్ రీడింగ్‌ను చెక్ చేయండి. ఇది మీ కారు సమయానికి సర్వీస్ పొందేలా, సర్వీస్ సమయంలో ఏవైనా సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Service Frequency
సాధారణంగా కారు ప్రతి 10,000 కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేయాలి. ఈ సమాచారాన్ని మీ కారు సర్వీస్ హిస్టరీ నుండి చెక్ చేయవచ్చు. సమయానికి సర్వీస్ చేయడం ద్వారా కారు సామర్థ్యం మెరుగుపడుతుంది. కారు చాలా కాలం పాటు మంచి స్థితిలో ఉంటుంది.

List Of Issues
మీ కారు ఏదైనా నిర్దిష్ట సమస్యను ఎదుర్కొంటుంటే దాన్ని లిస్ట్ అవుట్ చేసి సర్వీస్ సెంటర్‌కు సమాచారం అందించండి. ఇది టెక్నీషియన్ సమస్యను గుర్తించడానికి, వాటిని సరిగ్గా పరిష్కరించడానికి ఉపయోగంగా ఉంటుంది.

Authorized Service Center
మీ కారును సర్వీస్ చేసే సమయంలో కంపెనీ ఆధరైజ్‌డ్ కలిగిన సర్వీస్ సెంటర్ నుండి సర్వీస్ పొందండి. ఇది కారు సరిగ్గా ప్రామాణిక విధానాల ప్రకారం సర్వీస్ పొందుతంది.

Service Bills
సర్వీస్ తర్వాత బిల్లును జాగ్రత్తగా చెక్ చేయండి. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్లు మీకు తెలియని బిల్లులను యాడ్ చేసే అవకాశం ఉంది. మీరు తీసుకున్న సర్వీస్‌కు బిల్లు సరిపోయేలా ఉండాలి,

Tools Checking
సర్వీస్ తర్వాత మీ కారులో టూల్స్ చెక్ చేయండి. ఏదైనా టూల్ మిస్ అయినట్లయితే వెంటనే సర్వీస్ సెంటర్ మెకానిక్ లేదా సంబంధిత మేనేజర్‌ని సంప్రదించండి.

Also Read: Hydrogen Bike: మతిపోగొడుతున్న కొత్త టెక్నాలజీ.. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే బైక్!

Test Drive
సర్వీస్ తర్వాత మీ కారుని టెస్ట్ డ్రైవ్ చేయండి. అన్ని సమస్యలు పరిష్కరించబడిందని, కారు సజావుగా నడుస్తుందని నిర్ధారించుకోండి. సమస్య కొనసాగితే వెంటనే సరిచేయండి.  ఈ సులభమైన, ముఖ్యమైన చిట్కాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీరు మీ కారు సర్వీసింగ్‌ను మెరుగుపరచవచ్చు.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×