BigTV English

Toll Tax For Locals: ‘స్థానికులు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు’.. సోషల్ మీడియా వార్తల్లో నిజమెంత?

Toll Tax For Locals: ‘స్థానికులు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు’.. సోషల్ మీడియా వార్తల్లో నిజమెంత?

Toll tax rules for local residents(Live tv news telugu): కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ సమీపంలో నివసించే స్థానికులకు శుభవార్త చెప్పిందని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. కేంద్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో మాట్లాడుతూ.. టోల్ బూత్ కు 60 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న స్థానికులు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని.. కేవలం తమ ఆధార్ కార్డ్ చూపిస్తే చాలని ఈ వీడియోలో ప్రకటించినట్లు కనిపిస్తోంది.


ఈ వీడియో గత కొన్ని రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో కేంద్ర మంత్రి గడ్కరీ టోల్ గేట్ పరిసరాల్లో నివసించే ప్రజలకు వారి ఆధార్ కార్డ్ ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక పాసులు జారీ చేస్తుందని.. స్థానికుల వద్ద టోల్ టాక్స్ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటికే కొన్ని టోల్ బూత్ నిర్వాహకులు ఇష్టారీతిన టాక్స్ వసూలు చేస్తున్నారని ఇది చట్ట వ్యతిరేకమని చెబుతన్నట్లు వీడియోలో ఉంది. ప్రభుత్వం మూడు నెలల్లోకా పాసులు జారీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు వైరల్ వీడియో తో తెలుస్తోంది.

అయితే ఈ వీడియోలో ఉన్న ప్రకటన ప్రభుత్వం చేసినట్లు అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదు. ఈ వీడియోలోని వాస్తవాల గురించి గూగుల్ ఓపెన్ సెర్చ్ చేస్తే.. ఈ వీడియో 2002 సంవత్సరంలో పార్లమెంటులో నితిన్ గడ్కరీ చేసిన ప్రసంగానికి సంబంధించినదిగా తెలిసింది. అయితే ఇందులోని ఒక విషయం మాత్రమే నిజం. 60 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిలో రెండు టోల్ బూత్ లు ఉంటే వాటిలో ఒకటి మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. రెండోది చెల్లుబాటు కాదని చెప్పారు. కానీ స్థానికులకు టోల్ టాక్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించినట్లు ఎక్కడా లేదు. కేవలం టోల్ బూత్ పరిసరాల్లో నివసించే వారికి పాసులు కల్పించే విధానం తీసుకురావాలని ప్రతిపాదన మాత్రమే చేశారు. ఎటువంటి మినహాయింపులు ఇస్తున్నట్లు చెప్పాలేదు.


ALSO READ: రోడ్డు ప్రాజెక్టులతో ఉద్యోగ ఉపాధి.. కేంద్రం కసరత్తు

గడ్కరీ టూల్ బూత్ కు సంబంధించిన అధికారిక వీడియో దూరదర్శన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో మార్చి 22, 2022న అప్ లోడ్ చేసినట్లు ఉంది. ఈ వీడియోని కొంత మంది ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా యూజర్లు ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిసింది.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ కేసు, ఈ వీడియోలు నిజమేనని రిపోర్టు..

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×