Jio Data Offer: జియో నుంచి మళ్లీ ఒక పెద్ద ఆఫర్ వచ్చేసింది. కేవలం పదకొండు రూపాయలు పెట్టి పది జీబీ డేటా పొందే అవకాశం ఇస్తోంది. ఇది విన్నవెంటనే చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా అంత డేటా వస్తే వందలు రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ కేవలం రూ.11తోనే 10జీబీ డేటా అందిస్తుంది జీయో. అయితే ఈ ఆఫర్‌లో ఒక చిన్న షరతు ఉంది. ఈ డేటా మొత్తం ఒక గంటలోపే వాడేయాలి. అంటే మీరు రీఛార్జ్ చేసిన నిమిషం నుంచి 60 నిమిషాల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక గంట తర్వాత మిగిలిన డేటా ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అవుతుంది.
ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకం
ఇప్పుడు ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకం అని చూసుకుంటే, పెద్ద మొత్తంలో డేటా తక్కువ సమయంలో అవసరమయ్యే వారికి ఇది నిజంగా వరమనే చెప్పాలి. చాలామంది యూజర్లు ఒక సినిమా హై క్వాలిటీ వీడియోలో డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, పెద్ద గేమ్స్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే లేదా ఆఫీసు పనుల కోసం పెద్ద ఫైళ్లు పంపించుకోవాలనుకుంటే ఈ ఒక్క గంట డేటా ఆఫర్ చాలా ఉపయోగపడుతుంది. చిన్న మొత్తంలో పెద్ద పనిని పూర్తి చేయగలిగేలా ఇది రూపొందించబడింది.
Also Read: Child Health Tips: పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతున్నారా? అయితే కారణం అదే!
ఎలా రీచార్జ్ చేసుకోవాలి?
రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా సులభం. మై జియో యాప్ ఓపెన్ చేస్తే స్పెషల్ ప్లాన్స్‌లో ఈ రూ.11 ప్లాన్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేసిన వెంటనే 10జీబీ డేటా వస్తుంది. అయితే దీనిని వృధా కాకుండా వాడుకోవాలంటే ముందుగానే అవసరమైన పని సిద్ధం చేసుకోవాలి. ఒక గంట సమయం చాలా తక్కువ. కాబట్టి ఈ ప్లాన్ వేసుకున్న వెంటనే డౌన్‌లోడ్ లేదా అప్‌డేట్ మొదలుపెట్టడం మంచిది.
ఎందుకు గంట మాత్రమే పరిమితి పెట్టింది?
జియో ఈ ఆఫర్‌ని ఎందుకు వన్ అవర్ ప్లాన్‌గా పెట్టిందంటే, సాధారణ రోజువారీ వాడకం కోసం కాదు, కానీ ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే. ఎక్కువ డబ్బు పెట్టకుండా, ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డేటా కావాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. సరైన ప్లానింగ్‌తో ఈ ఆఫర్ వాడుకుంటే డబ్బు ఆదా అవుతుంది, పనులు సులభంగా పూర్తవుతాయి.