UPI Charges: యూపీఐ ఛార్జీల కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.UPI పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ల-MDR జనవరి వరకు వాయిదా వేసే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం వెలువడుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రిటైలర్లకు బిగ్ రిలీఫ్ ఖాయం.
యూపీఐ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్-ఎండీఆర్ ఛార్జీల అమల వాయిదా వేయాలని దేశంలోని వ్యాపార సంఘాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్పీసీఐని కోరాయి. గతంలో తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వర్తకులు, వ్యాపార సంఘాలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలీదుగానీ, ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అర్జీలు పెట్టుకున్నాయి.
ఈ క్రమంలో సంక్రాంతి సీజన్ ముగిసేవరకు కొత్త ఛార్జీల అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు జాతీయ బిజినెస్ ఛానెళ్లు ప్రధానంగా ప్రస్తావించాయి. పండుగల వేళ అమ్మకాలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని, ఇలాంటి సమయంలో కొత్త ఛార్జీలు అమలు చేస్తే వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ట్రేడ్ అసోసియేషన్లు చెబుతున్నారు. అయితే వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్పీసీఐ.. కొత్త ఎండీఆర్ రూల్స్ రూపొందించనున్నట్లు వ్యాపార వర్గాల మాట. వ్యాపారుల విజ్ఞప్తిపై ఎన్పీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. UPI, సర్వీస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు MDR, ఇతర అంశాలపై చర్చించడానికి సమావేశమైనట్టు తెలుస్తోంది.
గతంలో ఎన్పీసీఐ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన వ్యాపార కేటగిరీలో రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 రుసుం విధిస్తారు. అదే పెద్ద వ్యాపారులకు రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఫీజు ఉండనుంది. గరిష్ఠ పరిమితిని రూ.300గాఉండనుంది. మ్యూచువల్ ఫండ్స్, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్ వర్తించనుంది. దీనికి గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుందని తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల 4 శాతం వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడుతుందన్నది మాట.
ALSO READ: వడ్డీ రేట్లు పెంపు ప్రభావం.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు ఎంత?
95 శాతం పర్సన్ టు మర్చంట్ యూపీఐ ఛార్జీలు వర్తించవన్నది ఎన్పీసీఐ అంచనా. పీర్ టు పీర్ మోడల్‌ను ఉపయోగించే చిన్న వ్యాపారులు, సాధారణ వ్యక్తిగత వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం ఉండదని చెబుతోంది. వారంతా ఎప్పటి మాదిరిగా ఉచితంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు.