E-Paper
Advertisement

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!
Advertisement

Meta AI child safety tools: ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో చిన్నపిల్లల సేఫ్టీ అనేది అతి పెద్ద సవాలుగా మారుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టా మాతృ సంస్థ ‘మెటా’ ఆకతాయిల ఆట కట్టించడానికి టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో పిల్లలకు డేంజర్‌గా మారే చీకటి కోణాన్ని, హానికరమైన యాడ్స్‌ను అడ్డుకోవడానికి మెటా ఏకంగా సరి కొత్త ఏఐ టూల్స్‌ను రంగంలోకి దించింది. పిల్లలకు హాని చేసే కంటెంట్‌ను పూర్తిగా తొలగించడానికి, అంతే కాకుండా వివిధ రకాల ప్లాట్‌ ఫారమ్‌లను మరింత సేఫ్‌గా మార్చడానికి మెటా తెచ్చిన ఆ అద్భుతమైన ఏఐ అప్‌డేట్లు ,పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. 3.3 కోట్ల హానికరమైన కంటెంట్‌:

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పిల్లల సేఫ్టీకి భంగం కలిగించే దాదాపు 3.3 కోట్ల (33.2 మిలియన్ల) చెత్త కంటెంట్‌ను మెటా తొలగించింది. ఇందులో అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎవరూ రిపోర్ట్ చేయకముందే.. మెటా ఆటోమేటెడ్ సిస్టమ్స్ వాటంతట అవే 97 శాతానికి పైగా కంటెంట్‌ను ముందే గుర్తించి డిలీట్ చేసేశాయి. ఒక్క మన ఇండియాలోనే దాదాపు 53 లక్షల అలాంటి కంటెంట్‌ను మెటా తొలగించడం విశేషం.

2. “సిగ్నలింగ్” యాడ్స్‌కు ముగింపు:

Advertisement

కొంత మంది కేటు గాళ్ళు నేరుగా తప్పుడు పనులు పోస్ట్ చేయకుండా.. పైకి చూడటానికి చాలా నార్మల్‌గా ఉండే యాడ్స్ ద్వారా యూజర్లను వేరే డేంజరస్ వెబ్‌సైట్లకు లింక్ చేస్తుంటారు. దీన్ని టెక్నికల్‌గా “సిగ్నలింగ్” అంటారు. ఈ కొత్త మోసాన్ని పసి గట్టడానికి మెటా ఒక పవర్‌ఫుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏఐ టూల్‌ను తెచ్చింది. ఇకపై ఆ యాడ్ చూడ్డానికి ఎలా ఉంది అని కాకుండా.. అది యూజర్లను ఎక్కడికి తీసుకెళ్తోంది అని ఈ ఏఐ నిఘా పెడుతుంది. తప్పు దారి పట్టించే ఆ వెబ్‌సైట్లు, అకౌంట్ల పనిని పసిగడుతుంది.

3. రెడ్-టీమింగ్ ఏఐ ఏజెంట్ :

మెటా తన సెక్యూరిటీ సిస్టమ్‌లో.. ఏవైనా లూప్‌హోల్స్ ఉన్నాయా అని చెక్ చేసు కోవడానికి ఈ స్పెషల్ ఏఐ ఏజెంట్‌ను వాడతారు. హ్యాకర్లు మెటా సెక్యూరిటీని ఎలా దాటాలని చూస్తారో, ఈ ఏజెంట్ ముందుగానే పసిగట్టేస్తుంది. దీని వల్ల వాళ్ళ కొత్త ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టడం గ్యారెంటీ!

Advertisement

Also Read:  120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్! 

4. పాత నేరస్తులకు నో ఎంట్రీ:

ఒకసారి ప్లాట్‌ ఫారమ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తే చాలు.. అదే వ్యక్తులు వేరే ఫేక్ ఐడీలతో మళ్లీ లాగిన్ అవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఇట్టే.. పట్టేసేలా మెటా తన యూజర్ డిటెక్షన్ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసింది. సో, పిల్లలకు డేంజరస్ అయిన వాళ్ళకి ఇక్కడ నో ఎంట్రీ!

5. పేరంటల్ కంట్రోల్స్ అదుర్స్:

కేవలం యాడ్సే కాదు.. వాట్సాప్, ఇన్‌స్టాలో టీనేజర్లు ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఛానెల్స్ ఎలా వాడుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు కంట్రోల్ ఉండేలా కొత్త సెట్టింగ్స్ వచ్చాయి. పిల్లల ఆన్‌లైన్ లైఫ్‌ను పేరెంట్స్ ఈజీగా గమనించడానికి ఈ ఫీచర్లు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

సోషల్ మీడియాను పిల్లలకు నూటికి నూరుపాల్లు సేఫ్‌గా మార్చడానికి మెటా చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజంగా గొప్ప విషయమే. డిజిటల్ వరల్డ్‌లో కిడ్స్ సేఫ్టీని మెరుగు పరచడంలో ఈ ఏఐ టూల్స్ గేమ్ ఛేంజర్‌లా మారడం పక్కా!

Related News

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×