WhatsApp Security Update: ఒక్కసారి ఊహించుకోండి.. ఉదయం లేచి వాట్సప్ ఓపెన్ చేస్తే అకౌంట్ లాగౌట్ అయి ఉంటుంది. మళ్లీ లాగిన్ అవుదామంటే యాప్ పనిచేయడం లేదు. వినడానికి కాస్త షాకింగ్‌గా అనిపించినా.. పాత సాఫ్ట్‌వేర్‌తో వాట్సప్ వాడుతున్న వారికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. యూజర్ల సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెటా కొన్ని కొత్త మార్పులను టెస్ట్ చేస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే పాత ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సప్‌కు సపోర్ట్ నిలిచిపోయే అవకాశం ఉంది. మరి మీ ఫోన్ కూడా ఈ లిస్ట్‌లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదే కదా..
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను వాట్సప్ పరిమిత సంఖ్యలో బీటా యూజర్లతో టెస్ట్ చేస్తోంది. మీ ఫోన్ సిస్టమ్ పాతబడిపోతే.. వాట్సప్ ఓపెన్ కాకుండా ఆగిపోతుంది. మళ్లీ వాట్సప్ వాడాలంటే మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను కచ్చితంగా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాల్సిందే. దీనికోసం వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!
పాతబడిపోయిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో భద్రతా లోపాలు ఎక్కువగా ఉంటాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఫోన్లను సులభంగా టార్గెట్ చేసి డేటాను చోరీ చేసే అవకాశం ఉంది. అందుకే యూజర్ల వ్యక్తిగత సమాచారం, చాట్స్ సురక్షితంగా ఉంచడానికే కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంటోంది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో వచ్చే సెక్యూరిటీ ప్యాచెస్ వల్ల ఫోన్ భద్రంగా ఉండటంతో పాటు, హ్యాంగ్ కాకుండా వేగంగా పనిచేస్తుంది.
కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమే కాకుండా.. మరికొన్ని భద్రతా ఫీచర్లను కూడా వాట్సప్ టెస్టింగ్ చేస్తోంది. ముఖ్యంగా అధికారిక వాట్సప్ కాకుండా వేరే థర్డ్ పార్టీ యాప్స్ లేదా వెబ్ క్లయింట్ల ద్వారా లాగిన్ అయ్యేవారికి హెచ్చరిక మెసేజ్‌లు పంపేందుకు సిద్ధమవుతోంది. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే స్కామ్ మెసేజ్‌ల బారిన పడకుండా ఉండటానికి Scam Alerts అలాగే చాట్స్‌ను దాచుకోవడానికి Restricted Chats వంటి సెక్యూరిటీ టూల్స్ తెస్తోంది.
ఈ మార్పులపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు బీటా యూజర్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయడం మంచిది. దీనివల్ల వాట్సప్ ఆగిపోకుండా ఉండటంతో పాటు మీ ఫోన్ కూడా సురక్షితంగా ఉంటుంది.
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?