E-Paper
Advertisement

వడ్డీ రేట్లు పెంపు ప్రభావం.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు ఎంత?

వడ్డీ రేట్లు పెంపు ప్రభావం.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు ఎంత?
Advertisement

Gold Price Today: బంగారం-వెండి ధరలు తగ్గుతాయా? ఇంకా పెరిగే అవకాశముందా? ఇవే ప్రశ్నలు మార్కెట్ వర్గాలను వెంటాడుతున్నాయి. తాజాగా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో కొన్నాళ్లు విలువైన లోహాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం మార్కెట్లో ధరలు ఒక్కసారి పరిశీలిద్దాం.

వడ్డీ రేట్లు పెంపు ప్రభావం

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలు బంగారం మార్కెట్‌పై పడింది. ఫలితంగా మదుపరులు ఆలోచనలో పడ్డారు. కొద్దిరోజులుగా భారీగా పడిపోయిన పసిడి ధరలు, గురువారం కాస్త స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట. బంగారం-వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు

Advertisement

గురువారం ఉదయం గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 23 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,135 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి ధర కాస్త స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇవాళ ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బులియన్ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,560గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,37,090 వద్ద ఉంది. ప్రస్తుతం నగరంలో వెండి ధర రూ.2,23,826 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

దేశీయ మార్కెట్లో లోహాల ధరలు చూద్దాం

ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు రూ.1,49,690 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,37,240 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,37,090 వద్ద ఉంది. చెన్నైలో కాస్త ఢిల్లీ కంటే తక్కువ, మిగతా నగరాల్లో కాస్త ఎక్కువగా ఉంది. వెండి కిలో ధర రూ.2,23, 826 వద్ద కొనసాగుతోంది.

Advertisement

ALSO READ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక

ఉన్నట్లుండి అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారు బులియన్ వర్గాలు. డాలర్ 18 నెలల స్థాయి నుండి తగ్గడంతో గురువారం బంగారం ధర పెరిగిందని చెబుతున్నారు. రెండు నెలల కనిష్ఠ స్థాయి నుండి బులియన్ కోలుకోవడానికి సహాయ పడిందని చెబుతున్నారు. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాన్ని వ్యాపారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related News

రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయా?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక..

10వ తరగతి తరువాత కమర్షియల్ పైలట్ కావాలంటే ఏం చేయాలి? లైసెన్స్ ఎలా పొందాలి?

డైలీ SIP vs మంత్లీ SIP.. ఏ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వస్తుంది?

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ కావాలా? ఈ బ్యాంక్ కార్డులు తప్పనిసరి

భర్త, కూతురు చనిపోయారు.. ఒక కన్నుకు తీవ్ర గాయం.. అయినా గ్రూప్స్ పరీక్ష రాసి 2వ ర్యాంక్

Big Stories

Advertisement
×