E-Paper
Advertisement

అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?

అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?
Advertisement

Anaconda vs Python: ప్రపంచంలోనే అత్యంత భారీ సర్పాలనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి అనాకొండలు, పైథాన్‌లు (కొండచిలువలు). చూడటానికి ఒకేలా అనిపించినా.. ఇవి వేర్వేరు ఖండాలకు చెందిన విభిన్న సర్ప జాతులు. ఈ రెండూ విషరహిత సర్పాలే అయినప్పటికీ.. తమ బలమైన శరీరంతో ప్రత్యర్థిని ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాయి. అనాకొండలు దక్షిణ అమెరికాలోని నదీప్రాంతాలు, బురద నేలలకు పరిమితమైతే.. పైథాన్‌లు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ భారీ సర్పాలకు మధ్య ఉన్న ప్రధాన తేడాలు? సామర్థ్యంలో దేనిది పైచేయి? ఈ కథనంలో చూద్దాం.

రెండింటిలో ఏది పెద్దది?

అనాకొండ, పైథాన్‌లలో ఏది పెద్దది అనే చర్చ వచ్చినప్పుడు.. పొడవు, బరువును బట్టి సమాధానం మారిపోతుంది. పొడవు విషయానికి వస్తే రిటిక్యులేటెడ్ పైథాన్‌లు ప్రపంచంలోనే అత్యంత పొడవైన సర్పాలుగా రికార్డుకెక్కాయి. అయితే గ్రీన్ అనాకొండలు పొడవులో కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. బరువులో మాత్రం వీటిని కొట్టేది లేదు. అత్యంత భారీ కండరాలు, లావుపాటి శరీరంతో ఉండే గ్రీన్ అనాకొండనే ప్రపంచంలోనే అత్యంత బరువైన కొండచిలువగా గుర్తింపు పొందింది.

ఇవి ఎక్కడ నివసిస్తాయి?

Advertisement

అనాకొండలు ఎక్కువగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలు, చిత్తడి నేలలు, మంచినీటి కాలువల్లో నివసిస్తాయి. ఇవి తమ జీవితంలో ఎక్కువ భాగం నీటిలోనే మునిగి గడుపుతాయి. మరోవైపు పైథాన్‌లు ఎలాంటి ప్రాంతాల్లోనైనా జీవించగలవు. దట్టమైన వర్షారణ్యాలు, గడ్డిభూములు, రాతి కొండలు, బురద నేలలు ఇలా ఏ వాతావరణానికైనా ఇవి త్వరగా అలవాటుపడతాయి.

వేటాడే శైలి.. వేర్వేరు వ్యూహాలు

వేట విషయానికి వస్తే.. ఈ రెండు భారీ సర్పాలు శరీర బలంతోనే ప్రత్యర్థిని అంతం చేస్తాయి. అనాకొండలు నీటి అడుగున ఉండి ఒడ్డుకు నీళ్లు తాగడానికి వచ్చే జంతువుల కోసం దాడికి కాచుక్కూర్చుంటాయి. సరైన సమయం చూసి ఒక్కసారిగా దాడి చేసి నీటిలోకి లాగేస్తాయి. అనంతరం జంతువుకు బలంగా చుట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి. పైథాన్‌లు మాత్రం అడవుల్లో జంతువులు తిరిగే బాటల్లో, పొదల్లో, చెట్ల కొమ్మలపై నక్కి ఉండి అనుకూల సమయం రాగానే వేటపై దాడి చేస్తాయి.

ఈతలో దేనిది పైచేయి?

Advertisement

నీటిలో సంచరించడంలో అనాకొండలకు తిరుగులేదు. వీటి కళ్లు, ముక్కు రంధ్రాలు తల పైభాగంలో ఉంటాయి. దీనివల్ల శరీరం అంతా నీటిలో మునిగి ఉన్నప్పటికీ తల భాగాన్ని మాత్రమే స్వల్పంగా బయటకు ఉంచి చుట్టూ ఉన్న పరిసరాలని గమనించగలవు. పైథాన్‌లు కూడా ఈత కొట్టగలవు కానీ అనాకొండల స్థాయిలో పూర్తిగా నీటిపైనే ఆధారపడవు.

సంతానోత్పత్తిలో స్పష్టమైన తేడా

ఈ రెండు సర్పాల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం పునరుత్పత్తి విధానం. ఆడ అనాకొండలు గుడ్లకు బదులు నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి. ఒకేసారి డజన్ల కొద్దీ పిల్లలను ఇవి కంటాయి. కానీ పైథాన్‌లు మాత్రం గుడ్లు పెడతాయి. ఆడ పైథాన్ గుడ్ల చుట్టూ తన శరీరాన్ని చుట్టేసి అవసరమైన ఉష్ణోగ్రతను అందించేందుకు ప్రయత్నిస్తుంది. తన కండరాలను కదిలిస్తూ వెచ్చదనాన్ని కలిగిస్తుంది.

ప్రత్యేక జ్ఞానేంద్రియాలు

పైథాన్‌ల ముఖం భాగంలో ఉష్ణాన్ని గ్రహించే ప్రత్యేకమైన రంధ్రాలు (Heat-sensitive pits) ఉంటాయి. వీటి ద్వారా రాత్రి వేళల్లోనూ క్షీరదాలు, పక్షుల శరీర వేడిని పసిగట్టి సులభంగా వేటాడుతాయి. మరోవైపు నీటిలో ఎక్కువ సేపు ఉండే అనాకొండలు మాత్రం ఉష్ణ గ్రాహకాల కంటే వాసన, నీటిలో వచ్చే అలల ప్రకంపనలు, చూపుపైనే ఎక్కువగా ఆధారపడి వేటాడుతాయి.

Also Read: వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

ఆహార అలవాట్లు

కాపిబారాలు, కేమన్ (ఒక రకమైన మొసలి), జింకలు, ఇతర నీటి జీవులను అనాకొండలు ఆహారంగా తీసుకుంటాయి. పైథాన్‌లు తమ పరిమాణాన్ని బట్టి ఎలుకలు, పక్షులతో పాటు కోతులు, అడవి పందులు, చిన్న సైజు జింకలను కూడా మింగేస్తాయి. సాధారణంగా ఈ రెండు పాములూ మనుషులను చూస్తే దూరంగా వెళ్లడానికే ప్రయత్నిస్తాయి. కానీ తమకు ప్రాణాపాయం అనిపించినప్పుడు మానవులతో ఘర్షణకు దిగుతాయి. వేటగాళ్ల దాడి, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల ప్రస్తుతం ఈ భారీ సర్పాల ఉనికికి ముప్పు ఏర్పడుతోంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

Tags

Related News

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

Big Stories

Advertisement
×