E-Paper
Advertisement

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక..

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక..
Advertisement

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్బీఐ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి దాన్ని పూర్తిగా తొలగించింది. ఈ మేరకు జూలై చివర నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్బీఐ, బుధవారం గెజిట్‌లో ప్రచురించింది. ఆర్బీఐ నిర్ణయం వెనుక అసలు ఏం జరిగిందంటూ మార్కెట్ వర్గాలు చర్చించుకోవడం మొదలైంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్బీఐ ఝలక్

పేటీఎంకు అనుబంధం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కు గట్టి షాక్ ఇచ్చింది ఆర్బీఐ. గతంలో లైసెన్స్‌ రద్దు చేసిన ఆర్బీఐ, తాజాగా ఈ బ్యాంకును షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. అందుకు ఆర్బీఐ చట్టం-1934లోని రెండవ షెడ్యూల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 31న నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం గెజిట్‌లో ప్రచురితమైంది.

షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు

Advertisement

ఆర్బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో ఉన్న బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులుగా చెబుతారు. వీటికి ఆర్బీఐ నిర్దేశించిన ప్రత్యేక నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయి. అనేక కారణాల నేపథ్యంలో ఆర్బీఐ కొంతకాలంగా పేటీఎం బ్యాంక్ లిమటెడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను పాటించనందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో పీపీబీఎల్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది ఆర్బీఐ. అందులో ఆ బ్యాంకు వ్యవహారాలు దాని డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరంగా నిర్వహించబడ్డాయని ఆ నివేదిక తెలిపింది.

అసలు ఏం జరిగింది?

విజయ్‌శేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఉన్న ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం యొక్క అనుబంధ సంస్థ పీపీబీఎల్ వ్యవహారం గతంలో పలుమార్లు నియంత్రణ సంస్థల పరిశీలన పరిధిలోకి వచ్చింది. నాలుగేళ్ల కిందట అంటే 2022 మార్చిలో చేపట్టిన తనిఖీల్లో లోపాలు వెలుగుచూడటంతో ఆంక్షలు విధించింది ఆర్బీఐ. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా కఠిన చర్యలు తీసుకుంది. పూర్తిస్థాయి ఐటీ ఆడిట్ నిర్వహించాలని అప్పుడు ఆదేశించింది. రెండేళ్ల కిందట 2024 ఫిబ్రవరిలో ఖాతాల్లోకి కొత్త డిపాజిట్లు, క్రెడిట్లు, వాలెట్లు, టాప్-అప్‌లను నిలిపివేస్తూ మరికొన్ని ఆంక్షలు విధించింది.

Advertisement

ALSO READ: 10వ తరగతి తరువాత కమర్షియల్ పైలట్ కావాలంటే ఏం చేయాలి? లైసెన్స్ ఎలా పొందాలి?

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రద్దుకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ వరుస నిబంధనల ఉల్లంఘనలు, చట్టపరమైన ఇబ్బందుల వల్ల షెడ్యూల్డ్ బ్యాంకుల హోదాను కోల్పోయింది. వినియోగదారుల కోసం మీ డబ్బు సురక్షితంగా ఉందని ఆర్‌బిఐ ఏప్రిల్‌లో వెల్లడించింది. బ్యాంకును మూసివేసిన తర్వాత దాని మొత్తం డిపాజిట్లు తిరిగి చెల్లించడానికి తగినంత ద్రవ్య లభ్యత ఉందని పేర్కొంది. UPI , రీఛార్జ్‌లు, చెల్లింపులు మొదలైన వాటి కోసం Paytm యాప్‌ను ఉపయోగించవచ్చు.

Related News

10వ తరగతి తరువాత కమర్షియల్ పైలట్ కావాలంటే ఏం చేయాలి? లైసెన్స్ ఎలా పొందాలి?

డైలీ SIP vs మంత్లీ SIP.. ఏ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వస్తుంది?

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ కావాలా? ఈ బ్యాంక్ కార్డులు తప్పనిసరి

భర్త, కూతురు చనిపోయారు.. ఒక కన్నుకు తీవ్ర గాయం.. అయినా గ్రూప్స్ పరీక్ష రాసి 2వ ర్యాంక్

నెలకు రూ.3000 నుంచి ఏకంగా రూ.5 లక్షల జీతం.. NITలో బిటెక్ డ్రాపవుట్ సక్సెస్ స్టోరీ

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

Big Stories

Advertisement
×