E-Paper
Advertisement

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..
Advertisement

RBI Rate Hike On Housing loans Impact: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.50 శాతానికి చేర్చింది. దీనివల్ల గృహ రుణాలు తీసుకున్నవారిపై ప్రభావం పడనుంది. ఈఎంఐ పెరగడం లేకుంటే దీర్ఘకాలిక రుణ చెల్లింపు కాలం పెరుగుతుంది. వేగంగా ఈఎంఐలు తీర్చాలని భావించినవారికి ఆర్బీఐ వార్త గుదిబండగా మారింది.

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ తీసుకున్నవారికి షాక్

తక్కువ వడ్డీల సాఫీగా సాగిపోయిన గృహ రుణాల కస్టమర్ల ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేకులు వేసింది ఆర్బీఐ. బుధవారం ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీలో రెపో రేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. మార్కెట్లో దాదాపుగా అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు ఫ్లోటింగ్ రేట్ ఆధారంగా ముడిపడి ఉన్నాయి. బ్యాంకులు త్వరలో 25 బేసిస్ పాయింట్ల పెంపును ఖాతాదారుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నాయి. ఫిక్స్‌డ్ వడ్డీ రేటుపై లోన్లు తీసుకున్నవారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకుంటే.. ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చినప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం లేకుంటే తగ్గించడం జరుగుతుంది.

రెండు రకాల వడ్డీ రేట్లు.. ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్‌డ్ రేటు

Advertisement

ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లను బ్యాంకులు వచ్చే నెల నుంచి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెల నుంచి ఆ తరహా రుణాలు తీసుకున్నవారిపై ఆర్థికబారం పడనుంది. రూ. 40 లక్షల హోమ్ లోన్‌ తీసుకున్నవారిపై  ఈఎంఐ నెలకు రూ. 654 పెరుగుతుందని బ్యాకింగ్ అధికారుల మాట. ఓవరాల్‌‌గా సుమారు 20 ఏళ్లలో దాదాపు 2 లక్షల వరకు భారం పడుతుంది. రూ. 25 లక్షల లోన్‌పై 7.75 శాతం వడ్డీకి చొప్పున నెలకు ఈఎంఐ రూ. 20,523 గా ఉంటుంది. అది 8 శాతానికి చేరితే రూ. 20,911 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు సుమారుగా రూ. 387 పెరుగుతోంది.

50 లక్షల రుణం తీసుకున్నవారు నెలకు రూ.41,822 చెల్లించాలి. కోటి హోమ్ లోన్‌పై 20 ఏళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీతో గతంలో ఈఎంఐ రూ. 82,094 ఉండేది. 8 శాతం వడ్డీపై రూ. 83,644 గా మారనుంది. ఆ లెక్కన ప్రతి నెలా అదనంగా రూ. 1549 భారం పడుతుంది. లోన్ పెరిగే కొద్దీ నెలవారీ EMIపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వడ్డీ రేటు పెంపు అంటే రుణగ్రహీతలు అధిక EMI చెల్లించాల్సి వస్తుందన్నది అర్థం కాదు. రుణదాతలు EMI ని మార్చకుండా చెల్లింపు కాల పరిమితిని పొడిగిస్తారు.

Advertisement

ALSO READ: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

ఇప్పుడు బ్యాంకులు కూడా ఈ పద్దతిని అవలంభిస్తున్నాయి. ఇల్లు కొనాలనుకునే వారికి పెరిగిన రెపో రేటు కారణంగా కొత్త రుణాలు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. కొనుగోలుదారులు రుణాలను కేవలం ప్రధాన వడ్డీ రేటు ఆధారంగా మాత్రమే పోల్చుకోకూడదని బ్యాకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రామాణిక వడ్డీ రేటు, దానిపై రుణదాతకు ఉన్న వ్యత్యాసాన్ని, ఇతర ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నాయి.

Related News

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ కావాలా? ఈ బ్యాంక్ కార్డులు తప్పనిసరి

భర్త, కూతురు చనిపోయారు.. ఒక కన్నుకు తీవ్ర గాయం.. అయినా గ్రూప్స్ పరీక్ష రాసి 2వ ర్యాంక్

నెలకు రూ.3000 నుంచి ఏకంగా రూ.5 లక్షల జీతం.. NITలో బిటెక్ డ్రాపవుట్ సక్సెస్ స్టోరీ

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

EPFతో పాటు NPS కూడా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత డబుల్ బెనిఫిట్.. ఏం చేయాలంటే?

టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం

Big Stories

Advertisement
×