BigTV English

UP Crime News: వారంలో కూతురి పెళ్లి.. ఈలోగా అత్త లేచిపోయింది

UP Crime News: వారంలో కూతురి పెళ్లి.. ఈలోగా అత్త లేచిపోయింది

UP Crime News: మరో వారం రోజుల్లో కూతురు పెళ్లి. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బంధువులు ఒకొక్కరుగా ఇంటికి వస్తున్నారు. కాబోయే అల్లుడితో అత్త జెండా ఎత్తేసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇంతకీ ఈ ఘటన వెనుక అసలు కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడితో జితేంద్ర‌కుమార్ కూతురు శివానికీ పెళ్లి సెటిల్ అయ్యింది. శివాని తండ్రి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట మ్యారేజ్ సెటిల్ కావడంతో ఒక్కో పని చేయడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 16న శివానీ మ్యారేజ్ జరగనుంది.


పెళ్లి కుదిరిన కొద్ది రోజులకు అత్తకు మొబైల్ ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు కాబోయే అల్లుడు. కూతురితోపాటు అత్తతో తరుచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. కాబోయే అల్లుడు పలుమార్లు అత్తింటి వెళ్లాడు. గంటల తరబడి అత్తతో మాట్లాడేవాడు. శివానీ తల్లి మనసు మారిపోయింది. అల్లుడితో ప్రేమలో పడిపోయింది. ఒకప్పుడు అల్లుడు మాత్రమే ఫోన్ చేసేవారు.

కొద్దిరోజుల తర్వాత అత్త.. అల్లుడికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. మరో వారంలో శివానీకి పెళ్లి జరగనుంది. కూతురు పెళ్లి కోసం ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలు రెడీ చేశారు. వాటిని తీసుకుని కాబోయే అల్లుడుతో జెండా ఎత్తేసింది. అందులో మూడున్నర లక్షలు క్యాష్, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ALSO READ: నాలుగు రోజుల్లో ఎంగేజ్‌మెంట్, అనుకోకుండా

విచారణ మొదలుపెట్టిన పోలీసులు

కాబోయే అల్లుడితో అత్త పారిపోవడం కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబానికి ఉన్న పరువు పోగొట్టిందని భావించిన ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. జితేంద్రకుమార్ ఇంటి ఇల్లాలు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని అన్నారు.

పెళ్లికూతురు ఏమంది?

ఈ వ్యవహారంపై పెళ్లికూతురు శివానీ నోరు విప్పింది. ఏప్రిల్ 16న రాహుల్‌ను తాను వివాహం చేసుకోవాల్సి ఉందని తెలిపింది. ఆదివారం కాబోయే భర్తతో తల్లి పారిపోయిందని తెలిపింది. గడిచిన మూడు నెలలుగా రాహుల్ తో తన తల్లి నిత్యం ఫోన్‌లో మాట్లాడేదని వెల్లడించింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు అన్నీ అతడికి చేసిందని తెలిపింది.

కనీసం ఇంట్లో రూ.10 కూడా వదిలిపెట్టలేదని గోడు వెల్లబోసుకుంది. మా అమ్మ తనకు నచ్చినట్టు చేసిందని, తామేమీ చేయలేమని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో మాకు ఎలాంటి పట్టింపు లేవని, మాకు డబ్బు, నగలు తిరిగి ఇవ్వాలని కోరింది.

శివాని తండ్రి జితేంద్ర కుమార్ నోరు విప్పారు. తాను బెంగళూరులో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని తెలిపాడు. కాబోయే అల్లుడితో గంటల తరబడి తన భార్య మాట్లాడుతున్నట్లు విన్నానని తెలిపాడు. కూతురు వివాహం త్వరలో జరుగుతున్నందున ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, ఇంతలో అనుకోని ఘటన జరిగిందన్నాడు. కేవలం డబ్బు, నగదు కోసం ఈ పని చేసినట్టు కనిపిస్తోంది. వారిద్దరు పట్టుబడితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×