E-Paper
Advertisement

Horoscope Today April 10th : ఆ రాశి ఉద్యోగులకు ఊహించని సమస్యలు – ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today April 10th : ఆ రాశి ఉద్యోగులకు ఊహించని సమస్యలు – ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 10న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాల్లో అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

 మిధునం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంట్లో బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

సింహం: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

 ధనస్సు: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మకరం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

కుంభం:  దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×