E-Paper
Advertisement

Minor Girl Killed Father and Brother: మరో క్రైమ్ కథా చిత్రమ్.. మైనర్ బాలిక ఈమె, తండ్రి-అన్నను చంపేసి..

Minor Girl Killed Father and Brother: మరో క్రైమ్ కథా చిత్రమ్.. మైనర్ బాలిక ఈమె, తండ్రి-అన్నను చంపేసి..
Advertisement

Minor Girl Killed Father and Brother: ఒకరు మైనర్.. మరొకరు మేజర్ మంచి ఫ్రెండ్స్. అది కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితి వెళ్లిపోయారు. అయితే వీళ్ల తండ్రులిద్దరు రైల్వేలో పని చేస్తున్నారు. పిల్లలను వీళ్లిద్దరు పెద్దగా పట్టించుకోలేదు. అమ్మాయిలో మార్పులు రావడం గమనించాడు కన్నతండ్రి. ఇదంతా తప్పని అమ్మాయిని మందలించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి కూతురు బాయ్‌ఫ్రెండ్ ముకుల్‌సింగ్‌ను జైలుకి పంపించారు.ఇక్కడి నుంచే అసలు స్టోరీ మొదలైంది.

సీన్ కట్ చేస్తే.. మైనర్ బాలిక.. తండ్రి, తమ్ముడ్ని చంపేసింది. వారిద్దరి శరీరాలను ముక్కలుముక్కులు గా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. సంచలన రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది? స్టోరీ డీటేల్స్‌లోకి వెళ్తే.. ఈ ఏడాది మార్చినెల.. తన ప్రేమకు తండ్రి, తమ్ముడు అడ్డువస్తారని భావించింది జబల్‌పూర్‌కి చెందిన 15 బాలిక. ఎలాగైనా వారిని మట్టుబెట్టాలని కసి పెంచుకుంది.

Advertisement

ప్రియుడితో కలిసి చంపాలనే నిర్ణయానికి వచ్చేసింది. సరిగ్గా మార్చి నెలల్లో తండ్రి, తమ్ముడిని ప్రియుడి సాయంతో చంపేసింది బాలిక. ఎవరికీ అనుమానం రాకుండా వారిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టింది. ప్రియుడితో కలిసి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లింది. గోవా, బెంగుళూరు, ముంబై, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాలను తిరిగారు. హరిద్వార్‌లో మైనర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

కొద్దిరోజులుగా బాలిక ఇంటి తలుపు తీయలేదు. తండ్రి, తమ్ముడు కనిపించలేదు. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమీపంలోకి సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా మరో అబ్బాయితో కనిపించింది. ఆ అబ్బాయి ఎవరని ఆరా తీశారు. వీరి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. వారి ఫోన్ నెంబర్లను తొలుత ట్రేస్ చేశారు. దాని ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకుని పట్టుకున్నారు. హత్య జరిగి రెండు నెలలు తర్వాత హరిద్వార్‌లో పట్టుబడింది బాలిక. ముకుల్‌సింగ్ మాత్రం పరారైపోయాడు. బాలికను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు. దీంతో జరిగినదంతా బయటపెట్టింది. ఇంట్లో చూడగా ఫ్రిజ్ డెడ్ బాడీ ముక్కలు కనిపించాయి.

Advertisement

గతేడాది సెప్టెంబర్‌లో ముకుల్‌సింగ్‌పై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద వాడ్ని అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మైనర్ బాలిక తన  తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. పక్కాగా ప్లాన్ చేసింది. తండ్రిని చంపేటప్పుడు బాలిక తమ్ముడు నిద్రలో మేల్కొన్నాడు. ఈ విషయం బయటపెడతాడని భావించి ఎనిమిదేళ్ల తమ్ముడిని కూడా కత్తితో చంపేసింది. ప్రస్తుతం లవర్ ముకుల్‌సింగ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×