BigTV English

Hero Splendor XTEC 2.0: 73కిమీ మైలేజ్‌తో కొత్త స్ప్లెండర్ లాంచ్.. స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Hero Splendor XTEC 2.0: 73కిమీ మైలేజ్‌తో కొత్త స్ప్లెండర్ లాంచ్.. స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Hero Splendor XTEC 2.0: భారతీయ విస్వసనీయ టూ వీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ దేశీయ అటో మార్కెట్‌లో న్యూ-జనరేషన్ స్ప్లెండర్+ XTEC 2.0ని విడుదల చేసింది. కంపెనీ దీని ధరను రూ.82,911 ఎక్స్-షోరూమ్‌గా ఉంచింది. కొత్త జనరేషన్ హీరో స్ప్లెండర్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌ సైకిల్ బ్రాండ్ 30వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. అనేక ప్రీమియం, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. ఇందులో కంపెనీ ఎటువంటి మార్పులు చేసింది? మైలేజ్ ఎంత ఇస్తుంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Design Update
Splendor+ XTEC 2.0 హై-ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్ (HIPL)తో కూడిన కొత్త LED హెడ్‌ల్యాంప్‌ను తీసుకొచ్చింది. ఈ కమ్యూటర్ కొత్త H- ఆకారపు సిగ్నేచర్ టైల్‌లైట్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాస్త డిఫరెంట్ లుక్‌ను ఇస్తుంది. అయినప్పటికీ బైక్ ఇంతకముందు వచ్చిన వాటి మాదిరిగానే సిల్హౌట్‌ను కలిగి ఉంది.

Also Read: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..? తెలియకపోతే ఈ టిప్స్ పాటించండి!


Features
Splendor+ XTEC 2.0లో ఎకో-ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఉంది. కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMI) అలాగే కాల్‌లు, SMS,  బ్యాటరీ అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం బైక్ డేంజర్ లైట్లతో అప్‌డేట్ చేయబడింది. హీరో USB ఛార్జింగ్, మంచి కంఫర్ట్ కోసం పొడవైన సీటు ఉన్నాయి.

మరింత కంఫర్ట్ కోసం హింగ్ టైప్ డిజైన్‌తో పెద్ద గ్లోవ్‌బాక్స్‌ని తీసుకొచ్చింది. 2024 Hero Splendor+ XTEC 2.0 కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను కూడా పొందుతుంది. Splendor+ XTEC 2.0లో ఈ పవర్‌ట్రెయిన్ ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ (i3S)తో వస్తుంది. ఇది 73 kmpl క్లెయిమ్ చేయబడిన మైలేజ్ అందిస్తుంది.

Splendor+ XTEC 2.0లో సర్వీస్ ఇంటర్వెల్‌ను 6,000 కిమీలకు పెంచింది. దీని వల్ల రన్నింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కంపెనీ 5 సంవత్సరాలు/70,000 కిమీల వారంటీని కూడా అందిస్తోంది. కొత్త స్ప్లెండర్+ XTEC మూడు డ్యూయల్-టోన్ రంగులలో లభిస్తుంది. ఇందులో మ్యాట్ గ్రే, గ్లోస్ బ్లాక్,  గ్లోస్ రెడ్ ఉన్నాయి.

Also Read: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

హీరో స్ప్లెండర్ నేరుగా ఎయిర్-కూల్డ్, 97.2cc ఇంజన్‌తో 8,000 rpm వద్ద 8.02 hp, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇది 100cc కమ్యూటర్ బైక్‌లకు సమానం.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×