18 Killed in Chhattisgarh Road Accident: ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు కూడా డౌట్ గానే ఉంది. ఎక్కడ రోడ్డు ప్రమాదం సంభవిస్తుందో అని కుటుంబ సభ్యులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు దాపరించాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఆ ప్రమాదాల బారిన ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగంగా వెళ్లొద్దు.. అతివేగం ప్రమాదకరమని వాహనదారులకు అధికారులు ఎంత సూచిస్తున్నా కూడా పలువురు వాటిని లెక్కచేయకుండా వేగంగా వెళ్తూ వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతర వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది వరకు మృత్యువాతపడ్డారు. సుమారుగా 8 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని స్థానికులు చెబుతున్నారు.
ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా 18 మంది వరకు మృతిచెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కావర్ధా ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పికప్ వాహనం అదుపు తప్పి 20 అడుగులో లోయలో పడిపోయింది. ఆ వాహనంలో ఉన్నవారిలో 18 మంది మృతి చెందినట్లు, పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కావర్థా ప్రాంతంలో కబిర్దామ్ జిల్లా కుకడుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్ పని గ్రామంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆకుల సేకరణ కోసం అడవికి వెళ్లిన కూలీలు.. అడవి నుంచి తిరిగి ఓ మినీ గూడ్స్ వాహనంలో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆ వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడిపోయింది. విషయం తెలిసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఆ వాహనాన్ని స్పీడ్ గా తోలడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 18 మంది వరుకు మృతి చెందారని, అందులో ఎక్కువగా మహిళలు ఉన్నారని, 8 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
Also Read: ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పట్నుంచంటే..?
వాహనం 20 అడుగుల లోయలో పడిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువయ్యిందని, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 25 నుంచి 30 మంది వరకు ఉన్నారని, మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని తెలిపారు.