E-Paper
Advertisement

Hampi gang-rape: ఇజ్రాయెల్ టూరిస్టుల గ్యాంగ్ రేప్, మర్డర్.. ముగ్గురికి ఉరిశిక్ష విధించిన కోర్టు

Hampi gang-rape: ఇజ్రాయెల్ టూరిస్టుల గ్యాంగ్ రేప్, మర్డర్.. ముగ్గురికి ఉరిశిక్ష విధించిన కోర్టు
Advertisement

Hampi gang-rape:  కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో విదేశీ టూరిస్టుపై ( Hampi gang-rape) అవమానకర సంఘటన జరిగింది. ఓ ఇజ్రాయిల్ టూరిస్టు, ఇండియాకు చెందిన మరో మహిళపై సామూహిక అత్యాచారం ( Hampi gang-rape) చేశారు కొందరు దుర్మార్గులు. అయితే ఈ కేసులో తాజాగా దోషులకు శిక్ష పడింది. కర్ణాటకలోని హంపి సమీపంలో 2025 మార్చి ఆరవ తేదీన జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో తాజాగా దోషులకు మరణశిక్ష విధిస్తూ కొప్పల్ జిల్లా కోర్టు ( Koppal District Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి మరణ శిక్ష పడింది. మల్లేష్, శరణప్ప, చైతన్య సాయి అనే ముగ్గురికి మనన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది కొప్పల్ జిల్లా కోర్టు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

విదేశీ టూరిస్ట్ పై లైంగిక దాడి

Advertisement

భారతదేశంలో అనేక రకాల దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు తీసుకువచ్చినప్పటికీ మహిళలపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. కామ వాంఛతో చాలామంది దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే హంపి సమీపంలోని సానాపుర వద్ద అత్యంత దారుణ సంఘటన జరిగింది. 2025 మార్చి ఆరవ తేదీన హంపి సమీపంలో ఇజ్రాయిల్ టూరిస్ట్, మరో భారత మహిళ ను టార్గెట్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. ఆ విదేశీ టూరిస్ట్ పై దాడి చేసి దొంగతనం చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు ఈ ముగ్గురు నిందితులు.

కానీ ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారు. దాంతోపాటు మరో భారతీయ మహిళపై కూడా దారుణంగా దాడి చేశారు. ఆ విదేశీ టూరిస్ట్ పై దాడి చేయడమే కాకుండా ఆమెతో వచ్చిన వాళ్లను కూడా టార్గెట్ చేశారు. ఇక ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అత్యంత అరుదైన కేసుగా ఈ కేసును పరిగణించింది కోర్టు.

మరణ శిక్ష వేస్తూ కోర్టు తీర్పు

Advertisement

విదేశీ టూరిస్ట్ పై లైంగిక దాడి, హత్య కేసులో పైన పేర్కొన్న ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది కొప్పల్ జిల్లా కోర్టు ( Koppal District Court). ఫిబ్రవరి 16వ తేదీన గంగావతిలోని ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ఈ తీర్పు వెల్లడించారు. మల్లేష్, శరణప్ప అలాగే చైతన్య సాయి లకు మరణశిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా3 youths sentenced to death for 2025 Hampi gang-rape and murder of tourists

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×