BigTV English

UP Crime: పెళ్లిలో డీజే డ్యాన్స్ రచ్చ.. వరుడ్ని చంపేశారు, ఎవరి పని?

UP Crime: పెళ్లిలో డీజే డ్యాన్స్ రచ్చ.. వరుడ్ని చంపేశారు, ఎవరి పని?

UP Crime: తన కోపం తన శత్రవు అని సమయం, సందర్భం వచ్చినప్పుడు పెద్దలు చెబుతారు. చీటికి మాటికీ కోపం పడడం మంచిదికాదని అంటుంటారు. ఒక్కోసారి కోపానికి గురైనప్పుడు ఆ వ్యక్తులను రాక్షసులతో పోల్చుతారు. అలాంటి సందర్భం జరిగింది. చివరకు వివాహం సమయంలో పెళ్లి కొడుకుని చంపేశారు. ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.


ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లా జగదీష్‌పూర్ గ్రామంలో ఓ వివాహ వేడుక కాస్త విషాదంగా మారింది. వివాహం పేరు చెప్పేసరికి ఈ మధ్య కాలంలో డీజేలు నానాహంగామా చేస్తున్నాయి. అవే ఒక్కోసారి కొందరికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి కూడా. డీజే మ్యూజిక్‌కు డ్యాన్స్ చేసిన సందర్భంలో చిన్నపాటి గొడవ జరిగింది.

త్రిలోక్‌పూర్ గ్రామం నుండి ఊరేగింపుగా వరుడు తరపువారు వధువు ఇంటికి వచ్చారు. వచ్చే అతిథులు బిగ్గరగా డీజే మ్యూజిక్‌‌తో డ్యాన్స్ చేస్తూ వధువు ఇంటికి వెళ్లారు. ద్వార పూజ, తిలకం ఆచారాలు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత జయమాల వేడుక ప్రారంభం మొదలుకానుంది.


ఇంతలో వరుడు సభ్యులకు-వధువు వైపువారికి  DJ డ్యాన్స్ విషయంలో మాటా మాటా చోటు చేసుకుంది. చివరకు గొడవకు దారి తీసింది. చివరకు హింసాత్మకంగా మారింది. వరుడి తండ్రి పరిస్థితిని శాంతింప జేయడానికి ప్రయత్నించాడు. అయితే డ్యాన్స్ చేస్తున్నవారు ఫుల్‌గా మద్యం తాగారు. ఆయా వ్యక్తులు కోపంతో వరుడు తండ్రిపై దాడి చేయడం మొదలుపెట్టారు.

ALSO READ: ఇద్దరితో రిలేషన్ షిప్.. భర్త ఫ్యామిలీని చంపేందుకు స్కెచ్, చివరకు ఏమైంది?

పరిస్థితి గమనించిన పెళ్లి కొడుకు రాకేష్ రామ్ ఆ దాడిని అడ్డుకోవడానికి పరుగెత్తుకుంటూ తండ్రి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువకులంతా పెళ్లి కొడుకును కొట్టారు. దీంతో పెళ్లి కొడుకు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. తీవ్రగాయాల పాలైన  రాకేష్‌ను వెంటనే ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.

పెళ్లికొడుకును బతికించేందుకు వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు పెళ్లి కొడుకు మరణించాడు. గొడవ సమయంలో పిస్టల్‌ పట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించాడు. రాకేష్ తలపై అతడు బలంగా కొట్టినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

అందులో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని చేతులు పైన ఊపుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. వరుడిని కొట్టడానికి ఉపయోగించిన పిస్టల్ అదేనని, దానివల్లే తీవ్రంగా గాయపడి తరువాత మరణించాడని నమ్ముతున్నారు. పెళ్లి కొడుకు మృతి చెందడంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేతిలో పిస్టల్ ఉన్న యువకుడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి కొన్ని బుల్లెట్ దొరికాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×