NTR – Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ).. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్థాయిని ఏర్పరచుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి సైలెంట్గా రూ.600 కోట్ల క్లబ్లో చేరి తన స్టామినా ఏంటో నిరూపించారు. మరొకవైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ -2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ఇదే ఎన్టీఆర్ కు తొలి హిందీ చిత్రం కూడా.. ఇంకా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్1&2’, ‘సలార్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు.
చిత్రీకరణ దశలో డ్రాగన్ మూవీ..
ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ లేకుండానే.. దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో రామోజీ నగర్ ఫిలిం సిటీ లో భారీ సెట్ నిర్మించి, షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఈ మధ్యకాలంలో బాగానే వెలువడుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఒక యాక్షన్ సీన్ కోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నట్లు వార్తలు రాగా.. ఆ సెట్లో ఎన్టీఆర్ పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్ స్ ను ప్రశాంత్ నీల్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.
హీరోయిన్ పాత్రపై నెలకొన్న సందిగ్ధత..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వదులుతున్నారు కానీ ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. మొన్నటి వరకు ప్రముఖ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukhmini vasanth) హీరోయిన్ గానటిస్తోంది అంటూ వార్తలు రాగా.. దీనిపై ఆమె స్పందిస్తూ..” నిజమైతే బాగుండు” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటించడం లేదు అని అందరూ ఒక నిర్ధారణకు వచ్చేసారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హీరోయిన్ విషయంలోనే మరో వార్త వినిపిస్తోంది.
also read: Pooja Hegde: ఇదొక భయంకరమైన వార్త.. యాక్సెప్ట్ చేయాల్సిందే – పూజా హెగ్డే!
ఎన్టీఆర్ కి జోడీగా ప్రభాస్ బ్యూటీ..
సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga), రణబీర్ కపూర్ (Ranbir kapoor) కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ‘త్రిప్తి డిమ్రి’ ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో అవకాశం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈమెను ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే తెరపై ఆ సన్నివేశాలు ఇంకెలా ఉంటాయో అంటూ అభిమానులు అప్పుడే ఊహించేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని అందుకున్న త్రిప్తి.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో కూడా అవకాశం అంటే.. అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.