E-Paper
Advertisement

Road Accident: కాకినాడలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న రెండు కంటైనర్లు, ఒకరు సజీవదహనం

Road Accident: కాకినాడలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న రెండు కంటైనర్లు, ఒకరు సజీవదహనం
Advertisement

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే బస్సులు లేకుంటే లారీలు ఈ ఘటనకు కారణమవుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో గురువారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటెనర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది?

కాకినాడలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న రెండు కంటైనర్లు

Advertisement

కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  కత్తిపూడి ప్రాంతంలోని తెల్లవారుజామున రెండు కంటెనర్లు ఢీ కొన్నాయి. కత్తిపూడి జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్‌ను మరొక కంటైనర్ ఢీ కొట్టింది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కంటైనర్లలో ముందుభాగానికి మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనలో ఓ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మృతి చెందిన డ్రైవర్, కోల్‌కత్తాకు చెందినవాడు. అతడి పేరు కమల్ షేక్. మరొక డ్రైవర సురక్షితంగా బయటపడ్డాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

Advertisement

ఎగిసిపడిన మంటలు.. ఒకరు సజీవదహనం

ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. రెండు కంటైనర్ల ముందుభాగం ధ్వంసమైంది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ఆ రూట్లో వెళ్లే వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన ఎలా జరిగింది? ఒక కంటైనర్ విజయవాడ వెళ్తుండగా, మరొక కంటైనర్ ఎక్కడ నుంచి వస్తోంది? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరోవైపు కర్నూలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటయ్య సిల్వర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని వస్తువులతోపాటు ఓ వాహనం మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయపడగా, అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ప్రేమ కోసం తల్లిదండ్రులను చంపిన కన్న కూతురు, ఇదీ అసలు నిజం

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×