E-Paper
Advertisement

Tamilnadu Crime: కోడలి రిలేషన్‌షిప్.. మామ ఆగ్రహం, ప్లాన్ చేసి ఇలా దహనం

Tamilnadu Crime: కోడలి రిలేషన్‌షిప్.. మామ ఆగ్రహం, ప్లాన్ చేసి ఇలా దహనం
Advertisement

Tamilnadu Crime: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఈ తరహా ఘటనల నేపథ్యంలో హత్య జరుగుతున్నాయి. రోజుకో దగ్గర ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణమైన ఘటన బయటపడింది. కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామ సజీవ దహనం చేసింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది?

తమిళనాడు దారుణం.. మామని తగలబెట్టించిన కోడలు

Advertisement

బాధితుడి పేరు రాజేంద్రన్‌.. వయస్సు 64 ఏళ్లు. మలిగంపట్టు నివాసి కూడా. రాజేంద్రర్‌ కొడుకుతో జయప్రియ వివాహం జరిగింది. మొదట్లో దంపతులు బాగానే ఉండేవారు. ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. కాకపోతే కోడలు జయప్రియ వ్యవహారం పెద్దాయనకు సమస్యగా మారింది. పరిస్థితి గమనించిన మామ రాజేంద్రన్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా కోడలు ఏ మాత్రం మారలేదు.

తన ఆనందానికి అడ్డు వస్తావా అంటూ మామపై ఆగ్రహం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ విషయం జయప్రియ.. తన ప్రియుడి మణికందన్‌‌కి చెప్పింది. దీంతో రాజేంద్రన్‌ను లేపేయాలని డిసైడ్ అయ్యాడు. జనవరి 30న మలిగంపట్టు సమీపంలో బైక్‌పై వెళ్తున్న రాజేంద్రన్‌ని నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారి మధ్య మాటా మాటా వివాదానికి దారి తీసింది.

Advertisement

కోడలి వ్యవహారంపై మామ నిలదీత, ప్రియుడితో కలిసి

కోపంతో మణికందన్.. రాజేంద్రర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత రాజేంద్రర్ మంటలతో రోడ్డుపై నడుస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరించాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. వాటిపై సోషల్‌మీడియాలో దుమారం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వారిని విచారించగా కొత్త విషయాలు బయటకు‌వచ్చాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో రాజేంద్రన్ కోడలు జయప్రియ.. మణికందన్‌తో వివాహేత సంబంధం కలిగినట్టు తేలింది. అందుకు రాజేంద్రర్ పదేపదే అభ్యంతరం చెప్పడంతో మణికందన్‌ హెచ్చరించాడు. తమ ఆనందానికి అడ్డువస్తున్నాడని చెప్పి ప్లాన్ చేశాడు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు అతడిపై దాడి చేసి నిప్పు పెట్టారు.

ALSO READ: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి

ఆ తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. స్థానికులు రాజేంద్రన్‌ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రన్ 70 శాతం కాలిపోయాడని వైద్యులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. జయప్రియ, మణికందన్, కుబేంద్రన్, కారు యజమాని పార్థిబన్ లను అరెస్టు చేశారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×