E-Paper
Advertisement

Gadwal Municipal Elections: మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. జోరందుకున్న ఇంటింటా ప్రచారాలు!

Gadwal Municipal Elections: మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా  పార్టీల వ్యూహాలు.. జోరందుకున్న ఇంటింటా ప్రచారాలు!

Gadwal Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు.నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ప్రచారానికి తక్కువ వ్యవధి ఉండడంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులు కాలనీలలో తిరుగుతూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ వార్డుల అభివృద్ధి దృష్ట్యా ఈ ఎన్నికల్లో తమని ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరోపక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతు దారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్ని వార్డులలో గెలుపు కోసం కాంగ్రెస్ ,బీఆర్ఎస్ ,బీజెపి , ఇతర పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.జిల్లా కేంద్రంలో గద్వాల మున్సిపాలిటీ ఉండడం 37 వార్డులకు 232 నామినేషన్లు దాఖలు కావడంతో తీవ్ర పోటీ నెలకొనడంతో ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు సవాల్ గా మారాయి.

వార్డులలో ఎన్నికల కోలాహలం

వార్డుల వారీగా ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల ప్రచారాలతో ఎన్నికల కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్సి రావడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య ప్రధాన పోటీ ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గద్వాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు ఖరారు కాగా ఐజ, అలంపూర్, వడ్డేపల్లి బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో ఆయా సామాజిక వర్గాల వారు కౌన్సిలర్లుగా బరిలో నిలిచారు. రిజర్వేషన్లు అనుకూలించిన అభ్యర్థులు తొలుత కౌన్సిలర్లుగా గెలవడం ద్వారా పార్టీ ఆశీస్సులతో చైర్మన్,వైస్ చైర్మన్ పదవులు పొందేందుకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటా తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని హోటలను అభ్యర్థిస్తున్నారు.

Also Read:Gadwal Politics: మున్సిపాలిటీలో బీఫాం ల కేటాయింపుపై.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సంపత్ భేటీ!

3 న తుది జాబితా

మున్సిపల్ నామినేషన్ లలో గద్వాల మున్సిపాలిటీలో అత్యధికంగా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటిరోజు మందకోడిగా దాఖలైన నామినేషన్లు చివరి రోజు అధికంగా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీపడ్డారు. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో 3 న నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉండగా అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడనుంది.

విజయమే లక్ష్యంగా

మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అధినేతలు జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల జిల్లా ఇన్చార్జీలు జిల్లా కేంద్రంలో మకాం వేసి అభ్యర్థులను సమన్వయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రధాన పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా మారింది.అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీల వారీగా అభ్యర్థులు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతూ అన్ని వర్గాలని కలుస్తూ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులను కలుస్తూ వీలైన హామీలు ఇస్తూ కుల సంఘాల పెద్దలను కలిసి ఆశీర్వదించాలని తమ గెలుపుకు సహకరించి అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు ఓటర్లను వేడుకుంటున్నారు.

Also Read: Instagram Adds: ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా ఆఫ్ చేయండి

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×