Kadapa Crime News: కడప పట్టణంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని ప్రత్యర్థులు గొంతు కోసి కిరాతంగా చంపేశారు. బిల్టప్ కూడలి సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని మరాఠీ వీధికి చెందిన 32 ఏళ్ల షేక్ సాధిక్‌వలి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
కడప నగరంలో దారుణం
గతంలో బిల్టప్ ఏరియాలోని పుత్తా ఎస్టేట్స్ సమీపంలో వెంకటేశ్వర్లు అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ కేసులో సాధిక్‌వల్లి నిందితుడిగా ఉన్నాడు. అరెస్టయిన ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యాడు. మృతుడి బంధువులు కొన్నాళ్లుగా సాధిక్‌వల్లి కదలికలపై నిఘా ఉంచారు. పలుమార్లు రెక్కీ సైతం నిర్వహించారు. కొన్నిసార్లు సాధిక్ తప్పించుకున్నాడు.
కాపు కాసి మరీ
మంగళవారం రాత్రి బిల్టప్ కూడలికి రాగానే అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. సాదిక్‌ను కత్తులతో పలుమార్లు పొడిచారు. ఇంకా బతికి ఉంటాడని భావించి చివరకు గొంతు కోశారు. వెంటనే స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే సాధిక్ మృతి చెందాడు.
వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి డీఎస్పీ సహా ఇతర పోలీసులు చేరుకున్నారు. వెంటనే మృతుడ్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: వివాహితతో అక్రమ సంబంధం. ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన భర్త
సాధిక్ హత్య తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనలో నలుగురు లేదా ఐదుగురు పాల్గొనవచ్చని భావిస్తున్నారు. సమీపంలోని ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. పోలీసులు నిందితులను గుర్తించినట్టు తెలుస్తోంది.
స్థానికుల వెర్షన్ ఇదీ
నడి రోడ్డుపై హత్య ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని అంటున్నారు స్థానికులు. ఇటీవల కాలంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించలేదు. గతంలో బిల్టప్ కూడలి వద్ద జరిగిన హత్య ఘటన కొద్ది రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. బిల్టప్ కూడలిలో రెండు మద్యం షాపులు, ఒక బారు ఉంటుంది. మందుబాబులతో ఆ ప్రాంతం కిక్కిరిసి ఉంటుంది.
తాగిన మైకంలో పలుమార్లు అక్కడ గొడవలు జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. అయినా సరే పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. దాని ఫలితంగా సాధిక్‌వలీ హత్య జరిగిందని అంటున్నారు. పోలీసుల హడావుడి ఉంటే ఈ ఘటన జరిగేది కానదన్నది స్థానికుల మాట.
నడిరోడ్డుపై యువకుడి హత్య..
కడపలో దారుణ ఘటన
అందరూ చూస్తుండగానే సాదిక్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేసిన దుండగులు
పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు pic.twitter.com/0NgLrH89I7
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2025