Man Chew Private Parts of wife lover | భార్యభర్తల బంధం అంటేనే నమ్మకం, గౌరవం, ప్రేమల సమ్మేళనం. అయితే ఈ బంధంలో ద్రోహం ఎదురైతే ఎదుటి వ్యక్తి భరించలేడు. అప్పుడు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సాధారణంగా విచక్షణ ఉన్న మనుషులైతే విడాకులతో సరిపెట్టుకుంటారు. కానీ విచక్షణ లేని వారు కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే.. మరి కొందరు హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. ఈ రెండూ కాకుండా కొందరు మరీ పగ ప్రతీకారాలతో రగిలిపోయి మోసం చేసిన వారిని గుర్తుండి పోయేలా శిక్షించాలను కుంటారు. తాజాగా జరిగిన ఒక ఘటన ఈ మూడో రకానికి చెందినది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నగరంలో నివసించే కిషన్ (పేరు మార్చబడినది) ఒక యువకుడు రెండు రోజుల క్రితం అర్ధరాత్రి నగరంలోని బాబు పుర్వా పోలీస్ స్టేషన్ కు పరుగులు తీస్తూ వచ్చాడు. అతడు అర్ధనగ్నంగా ఉన్నాడు. తనను కాపాడండి అంటూ వచ్చాడు. అతని కాళ్ల మధ్య నుంచి తీవ్రంగా రక్త స్రావమవుతోంది. అది చూసిన పోలీసులు అతడిని తీసుకొని సమీపంలోని లాలా లాజపత్ రాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు.
బాబు పుర్వా పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ అరుణ్ ద్వివేదీ కథనం ప్రకాం.. బాబు పుర్వా ప్రాంతం సమీపంలోని ఒక గ్రామం నుంచి భజన్ లాల్ (30) ఒక వ్యక్తి తన భార్యతో సహా వలస వచ్చాడు. భజన్ లాల్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన భార్యతో బాబు పుర్వా ప్రాంతంలో నివసించేందుకు అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో అతని భార్యకు పొరుగున నివసించే కిషన్ తో పరిచయం ఏర్పడింది. కిషన్ నిరుద్యోగి కావడంతో ఇంటి దగ్గరే ఉండేవాడు.
ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దీంతో భజన్ లాల్ డ్యూటీ కోసం వెళ్లగానే అతని భార్య కిషన్‌తో తరుచూ మాట్లాడేది. ఈ క్రమంలో కిషన్ ను ఆమె ప్రేమించింది. అలా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత గరువారం ఉదయం భజన్ లాల్ తనకు ఢిల్లీ వెళ్లాల్సిన డ్యూటీ ఉందని చెప్పి వెళ్లాడు. అలా అతను ఇంటి నుంచి వెళ్లాడో లేదో.. కిషన్ కు ఫోన్ చేసి ఆమె పిలిచింది. ఆ ప్రేమికులిద్దరూ తమ ప్రేమ మాధుర్యంలో లోకాన్ని మరిచిపోయారు. ఆ రోజు రాత్రి కిషన్ ఆమె ఇంట్లోనే ఉండిపోయాడు. మరోవైపు ఆమె భర్త లారీ రిపేర్ రావడంతో ట్రిప్ రద్దు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు.
కానీ ఇంటి బయట ఉన్న భజన్ లాల్‌కు లోపలి నుంచి ఎవరో పురుషుడు ఉన్నట్లు శబ్దాలు వినిపించాయి. దీంతో అతను భార్యను అనుమానిస్తూ గట్టిగా తలుపు బద్దలు కొట్టాడు. లోపల దృశ్యం చూస్తే అతని హృదయం కలిచి వేసింది. భజన్ లాల్ వెంటనే తన నడుముకు ఉన్న బెల్టు తీసుకొని తన భార్యను చితకబాదాడు. మరోవైపు కిషన్ ఇదంతా చూసి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. తన భార్యను భజన్ లాల్ పక్కకు తోసి కిషన్ పై దాడి చేశాడు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. కిందపడేసి తన్నాడు. ఆ తరువాత అతడిని చంపకుండా జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పాలని భావించాడు. ఆ సమయానికి అతనికి కత్తి లాంటివి దొరకలేదు. అందుకే కిషన్ ప్రేవేట్ భాగాలను తన పళ్లతోనే కొరికేశాడు. కిషన్ ఆ నొప్పిని భరించలేక అతడిని పక్కకు నెట్టి.. అక్కడి నుంచి పరుగులు తీశాడు.
Also Read: పిన్ని చెల్లితో లవ్ అఫైర్.. తప్పు అని చెప్పినందుకు హత్య..
అక్కడి నుంచి తన ఇంటికి వెళితే అతను వెంబడిస్తాడని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే విచిత్రమేమిటంటే కిషన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు కేసు లేకుండా భజన్ లాల్‌తో సెటిల్ మెంట్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.