BigTV English

Bigg Boss Contestant: భరించలేక చచ్చిపోదాం అనుకున్నా.. హౌస్ అరెస్ట్ కూడా చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్..!

Bigg Boss Contestant: భరించలేక చచ్చిపోదాం అనుకున్నా.. హౌస్ అరెస్ట్ కూడా చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్..!

Bigg Boss Contestant:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని, కొంతమంది ఇప్పుడు వరుస సినిమాలలో లేదా సీరియల్స్ చేస్తూ బిజీగా మారితే, మరి కొంత మంది బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత అవకాశాలు లేవని ఇంటికే పరిమితమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే పైకి హుందాగా కనిపించే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జీవితాల్లోకి తొంగి చూస్తే మాత్రం.. నిజంగా కన్నీళ్లు ఆగవు అని చెప్పాలి. అలాంటి వారిలో ప్రముఖ బ్యూటీ శ్రీ సత్య (Sri Sathya) కూడా ఒకరు. అందానికి అందం , అభినయంతో మంచి పేరు సొంతం చేసుకున్న శ్రీ సత్య.. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. ముఖ్యంగా తన తోటి నటీనటులు బాగా వెనకేసుకుంటుంటే.. తాను మాత్రం సంపాదించలేకపోతున్నానే అనే దిగులు తనలో ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చింది.


చచ్చిపోదాం అనుకున్నా – శ్రీసత్య..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య.. ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్నానని, తన తండ్రి తనను హౌస్ అరెస్టు కూడా చేశారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. శ్రీ సత్య మాట్లాడుతూ..”నేను 19 ఏళ్లకే ఒక వ్యక్తిని ప్రేమించాను.అదే వ్యక్తితో ప్రేమ, నిశ్చితార్థం కూడా అయిపోయాయి. అయితే ఆ వయసుకు మెచ్యూరిటీ ఉండదు కదా.. సినిమాల్లో చూపించినట్టు పచ్చడి అన్నం అయినా వేసుకొని తింటాం అంటారు. అయితే రియల్ గా అది వర్క్ అవుట్ అవ్వదు. ఆ 19 సంవత్సరాల వయసులో అదే ప్రేమ అనుకుంటాం.. ఏం చేయకపోయినా దానినే ప్రేమగా ఫీల్ అవుతాము. కానీ రియాల్టీలో మాత్రం అలా ఉండదు. నేను కూడా సినిమాలు చూసి చెడిపోయాను ప్రేమించడం వరకు ఓకే కానీ , పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎంతో జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. మనకు జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తిని మాత్రమే ఎంచుకోవాలి. నిశ్చితార్థం అయ్యాక నువ్వంటే ఇష్టం లేదని ఆ వ్యక్తి చెప్పడంతో.. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను . డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. పైగా నాన్న నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అలా రెండు సంవత్సరాలు కెరీర్ కి బ్రేక్ ఇచ్చాను. నిజానికి మా నాన్నకు రిలేషన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.


అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను – శ్రీ సత్య

ప్రస్తుతం నేను సింగిల్ లైఫ్ లో చాలా సంతోషంగా వున్నాయి. నా జీవితంలో ఒక్కసారి అలా జరిగిన తర్వాత ప్రేమ, పెళ్లి పై నమ్మకం పోయింది. రిలేషన్ లో ఉండడం కూడా ఒక టైమ్ వేస్ట్ పద్ధతి. కానీ నాకు కొరియన్స్ లో ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకుంటాను ” అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ప్రేమ పేరుతో మోసపోయి నరకాన్ని అనుభవించానని చెప్పి ఎమోషనల్ అవుతూ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది శ్రీ సత్య. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×