E-Paper
Advertisement

Madhya Pradesh News: తల్లిపై అత్యాచారం.. షాకైక కొడుకు, చివరకు ఆత్మహత్య

Madhya Pradesh News: తల్లిపై అత్యాచారం.. షాకైక కొడుకు, చివరకు ఆత్మహత్య
Advertisement

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని భికుపురా ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిపై కొందరు అత్యాచారం చేయడంతో తట్టుకోలేక ఆమె కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన గ్రామస్తులు రహదారిని దిగ్బంధించారు. నిందితుడి ఇంటిపై రాళ్లు దాడి చేసి ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లో దారుణం.. టీనేజర్ ఆత్మహత్య వెనుక

Advertisement

మధ్యప్రదేశ్‌లో దేవాస్ జిల్లాలోని శనివారం దారుణమైన ఘటన బయటకు వచ్చింది. తన తల్లిపై లైంగిక దాడి జరగడంతో తట్టుకోలేకపోయాడు బాధితురాలి 17 ఏళ్ల కొడుకు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ మాలవీయ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సున్నితమైన కేసు కావడంతో మహిళా అధికారి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు స్వీకరించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆరోపించారు. ఫలితంగా ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జరిగిన పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కొడుకు శనివారం ఉదయం పురుగుల మందు తాగాడు.

Advertisement

బాలుడి తల్లిపై అత్యాచారం.. కేసు నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం

వెంటనే వాడ్ని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో ఆగ్రహానికి గురయ్యారు స్థానికులు. బాలుడి మృతదేహంతో పుంజాపురా-బాగ్లీ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతేకాదు నిందితుడి ఇంటిపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. అతడి వాహనానికి నిప్పుపెట్టారు. ఈా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులో ఉంది. నిందితుడు సునీల్ మాలవీయను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మహిళా అధికారి లేకపోవడంతోనే కేసు నమోదు చేయడం ఆలస్యమైందని తెలిపారు.

ALSO READ: వీధి కుక్కల బీభత్సం.. 8 ఏళ్ల బాలికపై దాడి, రక్తపు మడుగులో చిన్నారి

ఈలోపు ఊహించని దురదృష్టకర ఘటన జరిగిందన్నారు. నిందితుడి ఆస్తులపై విచారణ జరుపుతామని హమీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించకుంటే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఘటన చెబుతోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×