BigTV English

Bihar Crime: ప్రియుడి ప్రేమ కోసం.. భర్తని చంపేందుకు షూటర్లు, అనూహ్యంగా చిక్కిన నవ వధువు

Bihar Crime: ప్రియుడి ప్రేమ కోసం.. భర్తని చంపేందుకు షూటర్లు, అనూహ్యంగా చిక్కిన నవ వధువు

Bihar Crime: ఈ మధ్యకాలంలో మ్యారేజ్ తర్వాత లవ్‌లు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. భర్తను ఒప్పించి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం జరుగుతున్నాయి. పెళ్లైన భర్తను వదిలేయడం, లేకుంటే చంపేసి మరీ ప్రియుడితో వెళ్లిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటన జరిగింది. వివాహం జరిగిన నెలన్నరకే భర్తను చంపేసింది. అందుకోసం షూటర్లను రంగంలోకి దింపింది ఆ నవ వధువు. అనుకున్న పని తర్వాత ప్రియుడితో పెళ్లి రెడీ అవుతున్న సమయంలో అడ్డంగా దొరికిపోయింది.


వివాహ బంధానికి క్రమంగా విలువ లేకుండా పోతోంది. పెళ్లి సమయంలో మనసులోని మాటను పేరెంట్స్ చెప్పలేక పెళ్లైన తర్వాత భర్తలను చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇండోర్ రాజా రఘువంశీ కేసు నుంచి ఈ పరంపర మొదలైంది. ఈ జాడ్యం మిగతా రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తోంది.

లేటెస్ట్‌గా బీహార్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన 45 రోజులకే భర్తను హత్య చేయించింది ఓ నవ వధువు. కోరుకున్న ప్రియుడు మేనమామతో కలిసి జీవితం పంచాలని భావించింది. అనుకున్నట్లుగా భర్తని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది.


ఔరంగాబాద్ జిల్లాలోని బర్వాన్ గ్రామానికి చెందిన ప్రియాన్షుకు పెళ్లైంది. అతడి వయస్సు 25 ఏళ్లు. నెలన్నర కిందట 20 ఏళ్ల గుంజాదేవితో వివాహం జరిగింది. మ్యారేజ్ జరిగి 45 రోజులు గడిచింది. పెళ్లికి ముందు గుంజాదేవికి తన మేనమామ 55 ఏళ్ల జీవన్ సింగ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుంజాదేవి తన ఆలోచనను కుటుంబ సభ్యులు చెప్పింది. అందుకు వారు అంగీకరించలేదు. ఆమెకు ఇష్టం లేకుండా ప్రియాన్షుతో బలవంతంగా చేశారు.

ALSO READ: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు డబ్బులివ్వలేదని తండ్రిని నరికిన కొడుకు

భర్తతో కాపురం ఇష్టంలేని భార్య గుంజాదేవి, ప్రియాన్షు అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని తన మేనమామ జీవన్ సింగ్‌ చెప్పింది. ఇద్దరు కలిసి కుట్రకు ప్లాన్ చేశారు. జూన్ 25న ప్రియాన్షు.. తన సోదరి ఇంటికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. నవీనగర్ రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరినైనా పంపాలని గుంజా దేవికి ఫోన్ చేసి చెప్పాడు.

చెప్పినట్టు గుంజా‌దేవి చేసింది. కాకపోతే షూటర్లను రంగంలోకి దింపింది. స్టేషన్ నుంచి ఇంటికి బైక్‌పై వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు ప్రియాన్షును అడ్డగించి కాల్చి చంపారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భర్త చనిపోయిన తర్వాత గుంజాదేవి ప్రవర్తనలో ప్రియాన్షు ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. అత్తింటి నుంచి వెళ్లిపోయేందుకు స్కెచ్ వేసింది. ఇదే సమయంలో గుంజాదేవి కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. ఆమె.. మేనమామ జీవన్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు.

జీవన్ సింగ్ కాల్ డేటాను విశ్లేషించగా షూటర్లతో సంప్రదింపులు జరిపినట్లు కీలక ఆధారాలు దొరికాయి. పెళ్లి జరిగిన 45 రోజులకే భర్తను మట్టుబెట్టింది గుంజాదేవి. ఆమెతోపాటు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఆమె మామ జీవన్‌సింగ్ కోసం గాలిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ తెలియజేశారు.

Related News

Florida accident: నిర్లక్ష్యపు యూ-టర్న్.. అమెరికాలో ముగ్గురి ప్రాణాలు తీసిన ఇండియన్ ట్రక్ డ్రైవర్

Rajasthan News: లవర్‌తో కలిసి భర్తను దారుణంగా చంపి.. డ్రమ్ములో పడేసి పరార్.. చివరకు ఏమైందంటే?

Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..

Mulugu crime: భర్తను చంపేసిన భార్య.. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి మరీ నాటకం.. చివరకు!

Hyderabad crime: కూకట్‌పల్లిలో కలకలం.. పాపను చంపి పరారైన దుండగులు!

Warangal News: కేవలం అక్రమ సంబంధమే కాదు.. ప్రియుడితో భార్య ప్లాన్, కాకపోతే సీన్ రివర్స్

Big Stories

×