Top Heroine: సినీ ఇండస్ట్రీలో అత్యంత ఘోరమైన సంఘటన అందరిని భయానికి గురి చేస్తోంది. సాధారణంగా గతంలో సినిమాలలోనే ఆడవారు తమ భర్తలను లేదా ప్రేమించిన వారిని చంపడం మనం చూశాం. అయితే ఈ మధ్యకాలంలో రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెళ్లయిన అమ్మాయిలు తమ భర్తలను అత్యంత దారుణంగా చంపిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా ఒక స్టార్ హీరోయిన్ తన ప్రియుడి తల నరికి, మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ప్రియుడి తల నరికిన స్టార్ హీరోయిన్.
ఆస్ట్రేలియన్ టీవీ స్టార్ (టీవీ జర్నలిస్ట్) తమికా సుయాన్ – రాస్ చెస్సర్ (Tamika Suan – Ross Chesser) (34) ప్రస్తుతం హత్యారోపణలు ఎదుర్కొంటోంది .తన బాయ్ ఫ్రెండ్ జూలియన్ ను చంపినట్లుగా పోలీసులు అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. పోర్ట్ లింకన్ లోని ఒక అపార్ట్మెంట్లో చిన్నగా అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందడంతో.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భయానక దృశ్యాన్ని చూసి విస్తుపోయారట. తమిక బాయ్ ఫ్రెండ్ జూలియన్ మృతదేహం తల లేకుండా.. కాలిపోయిన, వికృతమైన శరీర అవశేషాలు బాత్రూంలో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఈ హత్య జూన్ 17న అర్ధరాత్రి సమయంలో జరిగి ఉండవచ్చని, హత్య జరిగిన కాసేపటికి ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి.. మూడు కుక్కలను తీసుకెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇక దీంతో ఈమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
జూలియన్ తలను గుర్తించిన వారికి బహుమతి..
ఇకపోతే అర్ధరాత్రి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత నలుపు రంగు దుస్తుల్లో తల నుంచి కాలి వరకు పూర్తిగా కప్పుకున్న ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలలో పోలీసులు గుర్తించారు. ఆ మహిళ కచ్చితంగా ఈమె అయి ఉంటుందని వారు నమ్ముతున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్తున్న సమయంలో జూలియన్ తలను బాడీ నుంచి వేరు చేసి బయటకు తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. “జూలియన్ తలను గుర్తించిన వారికి బహుమతి ఇస్తామని” కూడా ప్రకటించారు.
జూలియన్ మర్డర్ కేసు పై డిటెక్టివ్ స్పందన..
ఇక ఈ మర్డర్ కేసులో డిటెక్టివ్ సూపర్డెంట్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ వార్త జూలియన్ కుటుంబానికి తీవ్ర వేదనను కలిగిస్తుంది. మీరు కూడా ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించండి. జూలియన్ తలను తిరిగి పొందితేనే వారు శాంతియుతంగా అంత్యక్రియలు జరిపి, అతనిని విశ్రాంతిలో ఉంచేలా చేయగలరు. కాబట్టి దీనికి కూడా ప్రజలు సహకరించాలి” అని కోరారు . మరి జూలియన్ తల ఎక్కడుందో? ఎవరు తీసుకెళ్లారో? అసలు ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
also read:TV Actress: ఒకప్పుడు బుల్లితెర స్టార్..ఇప్పుడు కూలీగా అవతారం.. అంత దీనస్థితికి దిగజారిందా?